అక్షరటుడే, వెబ్‌డెస్క్: October Movies | సెప్టెంబర్ నెల టాలీవుడ్‌కు (Tollywood) సూపర్ లక్ తెచ్చిపెట్టింది. ‘ఓజీ’ వంటి భారీ చిత్రం నుంచి ‘లిటిల్ హార్ట్స్’ (Littel Hearts), ‘మిరాయ్’, ‘కిస్కింధపురి’ వంటి చిన్న, మిడిల్ రేంజ్ సినిమాల వరకూ మొత్తం నాలుగు సినిమాలు బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించాయి.
ప్రేక్షకులు కంటెంట్‌కి రెస్పాండ్ అవుతారని మరోసారి నిరూపితమైంది. దీంతో ఇండస్ట్రీ మొత్తం ఊపుమీద ఉంది. ఇప్పుడు అక్టోబర్ మీదే అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా రవితేజ, సిద్ధూ జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు ఈ నెలలో హిట్ కొట్టాల్సిన అవసరంలో ఉన్నారు.
October Movies | అక్టోబర్ కూడా మంచి సినిమాతో ..!
అక్టోబర్‌కు ‘కాంతార ఛాప్టర్-1’ మంచి శుభారంభం ఇచ్చింది. ఇది కన్నడ డబ్బింగ్ మూవీ అయినప్పటికీ, తెలుగులో మంచి వసూళ్లు రాబడుతోంది. దసరా వీకెండ్‌ను పూర్తిగా ఆక్రమించుకుంది.
October Movies | రాబోయే రిలీజ్‌లు: హోప్స్‌తో హీరోలు
- అక్టోబర్ 10: శశి వదనే – రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా నటించిన ఈ చిత్రం “క్లీన్ లవ్ స్టోరీ”గా ప్రచారంలో ఉంది. ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.
- అక్టోబర్ 16: మిత్ర మండలి – ప్రియదర్శి, నిహారిక Niharika ఎన్‌ఎమ్, రాగ్ మయూర్ నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. బన్నీ వాస్ సమర్పణలో వస్తోంది.
- అక్టోబర్ 17: తెలుసు కదా – సిద్ధూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో, నీరజ్ కోన దర్శకత్వంలో రూపొందిన లవ్ ట్రైయాంగిల్. ట్రైలర్‌కు డిఫరెంట్ టోన్ ఉంది. అదే రోజు తమిళ డబ్బింగ్ మూవీ డ్యూడ్ కూడా రిలీజ్ కానుంది.
- అక్టోబర్ 18: కె ర్యాంప్ – కిరణ్ అబ్బవరం నటించిన యూత్ ఎంటర్‌టైనర్. ట్రైలర్ మంచి హైప్‌ను తెచ్చుకుంది.
- అక్టోబర్ 21: థామా (తెలుగు వెర్షన్) – రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా తెలుగులో విడుదల అవుతోంది.
- అక్టోబర్ 31: మాస్ జాతర – రవితేజ, శ్రీలీల Sreeleela జంటగా నటించిన మాస్ యాక్షన్ డ్రామా. ఇదే రోజు ప్రభాస్ – రాజమౌళి కలయికలో రూపొందిన బాహుబలి: ది ఎపిక్ కూడా థియేటర్లకు వస్తోంది.
October Movies | హీరోలకెందుకు ఈ సినిమాలు కీలకం?
- రవితేజ: గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ‘మాస్ జాతర’ సినిమాతో తిరిగి ఫామ్ లోకి రావాలని ఆశిస్తున్నారు. ఇది హిట్ అయితే అతని కెరీర్ మళ్లీ ఊపందుకునే అవకాశముంది.
- సిద్ధూ జొన్నలగడ్డ: ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ తర్వాత వచ్చిన ‘జాక్’ డిజాస్టర్ కావడంతో, ‘తెలుసు కదా’ మీద భారీ భారం పడింది. ప్రేక్షకులకు కనెక్ట్ అయితే, మార్కెట్ నిలబెట్టుకునే అవకాశం ఉంది.
- కిరణ్ అబ్బవరం: ‘క’ సినిమా తర్వాత వచ్చిన ‘దిల్ రుబా’ నిరాశపరిచింది. ఇప్పుడు ‘కె ర్యాంప్’ ద్వారా మళ్లీ తన స్థానాన్ని సంపాదించుకోవాలని చూస్తున్నాడు Kiran.