HomeజాతీయంGST Reforms | రూ.8 లక్షల్లోపు ధరలో.. బెస్ట్‌ మైలేజీ కార్లు ఇవే!

GST Reforms | రూ.8 లక్షల్లోపు ధరలో.. బెస్ట్‌ మైలేజీ కార్లు ఇవే!

జీఎస్టీ సంస్కరణల(GST reforms)తో కార్ల ధరలు తగ్గాయి. ఎక్కువ మైలేజీ ఇచ్చే పలు కార్లు రూ. 8 లక్షలలోపు ధరలో అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | దేశంలో కార్లకు డిమాండ్‌ పెరిగింది. జీఎస్టీ సంస్కరణ (GST Reforms)లతో ధరలు తగ్గడంతో చాలామంది కార్లను కొనుగోలు చేస్తున్నారు. మధ్య తరగతికి మైలేజీ కూడా ముఖ్యమే.. ఈ నేపథ్యంలో రూ. 8 లక్షలలోపు ధరలో అందుబాటులో ఉన్న కార్ల గురించి తెలుసుకుందామా..

GST Reforms | మారుతి సుజుకీ సెలెరియో..

కాంపాక్ట్‌ హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌లో మారుతి సుజుకీ సెలెరియో(Maruti Suzuki Celerio) ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దీని పెట్రోల్‌ వేరియంట్‌ లీటరుకు 26.6 కి.మీ., సీఎన్‌జీ(CNG) వేరియంట్‌లో కేజీకి 35.12 కి.మీ. మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఈ కారు ఎల్‌ఎక్స్‌ఐ ఎంటీ వేరియంట్‌ ఎక్స్‌ షోరూం ధర రూ. 4.70 లక్షలనుంచి ప్రారంభమవుతుంది.

GST Reforms | మారుతి సుజుకీ వేగన్‌ఆర్‌..

అర్బన్‌ మెబిలిటీలో ప్రజాదరణ పొందిన మారుతి సుజుకీ వేగన్‌ఆర్‌(Maruti Suzuki Wagon R).. లీటరుకు 26.1 కి.మీ. మైలేజీ ఇస్తుంది. దీని విశాలమైన ఇంటీరియర్‌, కాంపాక్ట్‌ డిజైన్‌ ఆకర్షిస్తాయి. ఎల్‌ఎక్స్‌ఐ ఎంటీ(LXI MT) వేరియంట్‌ ధర(ఎక్స్‌ షోరూం) రూ. 4.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

GST Reforms | మారుతి సుజుకీ ఆల్టో కే 10

బడ్జెట్‌లో బెస్ట్‌ మైలేజీ కోరుకునేవారికి మారుతి సుజుకీ ఆల్టో కే 10(Maruti Suzuki Alto K10) ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది. ఇది లీటరుకు 24.8 కి.మీ. మైలేజీ ఇస్తుంది. దీని ప్రారంభ వేరియంట్‌ ధర(ఎక్స్‌షోరూం) రూ. 3.70 లక్షలుగా ఉంది. ఇది తక్కువ నిర్వహణ ఖర్చుతో బడ్జెట్‌ ఫ్రెండ్లీ(Budget friendly) మోడల్‌గా నిలుస్తోంది.

GST Reforms | మారుతి సుజుకీ స్విఫ్ట్‌

ఆకర్షణీయమైన డిజైన్‌, మంచి మైలేజీ ఇచ్చే బెస్ట్‌ బడ్జెట్‌ కార్లలో మారుతి సుజుకీ స్విఫ్ట్‌(Maruti Suzuki Swift) ఒకటిగా నిలుస్తోంది. ఇది లీటరుకు 23.2 కి.మీ. మైలేజీ ఇస్తుంది. వీఎక్స్‌ఐ వేరియంట్‌ రూ.7.71 లక్షల నుంచి లభిస్తుంది. పెద్ద హ్యాచ్‌బ్యాక్‌ కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక.

మారుతి సుజుకీ డిజైర్‌ :

మారుతి సుజుకీ డిజైర్‌(Maruti Suzuki Dzire) లీటరుకు 24.1 కి.మీ. మైలేజీ ఇస్తుంది. ఇది సిటీ డ్రైవింగ్‌, హైవే ప్రయాణాలకు రెండింటికీ బెస్ట్‌ ఎంపికగా నిలుస్తోంది. ఎల్‌ఎక్స్‌ఐ ఎంటీ వేెరియంట్‌(ఎక్స్‌షోరూం) ధర రూ. 6.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

GST Reforms | హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌

కాంపాక్ట్‌ ఎస్‌యూవీ హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌(Hyundai Exter) యువతను ఆకర్షిస్తోంది. ఇది లీటరుకు 19 కి.మీ. మైలేజీ అందిస్తోంది. బేస్‌ వేరియంట్‌ ధర(ఎక్స్‌షోరూం) రూ. 5.68 లక్షలనుంచి ప్రారంభమవుతుంది.

టాటా పంచ్‌

కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విభాగానికి చెందిన పాపులర్‌ మోడల్‌ టాటా పంచ్‌(Tata Punch) విశేష ఆదరణ పొందింది. ఇది లీటరుకు 18 కి.మీ. వరకు మైలేజ్​ ఇస్తుంది. ఎక్స్‌ఈ వేరియంట్‌ ధర రూ. 6 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.