అక్షరటుడే, వెబ్డెస్క్ : Ram Madhav | భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మధ్య విభేదాలు తలెత్తాయన్న ప్రచారాన్ని ఆ పార్టీ సీనయర్ నేత రామ్ మాధవ్ (Ram Madhav) తోసిపుచ్చారు. అవన్నీ ఊహాగానాలేనని కొట్టి పడేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ ఒకే సైద్ధాంతిక భావనతో పని చేస్తాయని చెప్పారు.
ఏఎన్ఐకి శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఒకే గొడుగు కింద పని చేసే రెండు సంస్థల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. కొందరికి ఎలాంటి సమస్య కనిపించకపోతే ఇలాంటి ప్రచారాలను ముందుకు తీసుకొస్తారని విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day) సందర్భంగా జాతినుద్దేశించిన ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్‌ను ప్రశంసించడం “రాజ్యాంగానికి అవమానం” అని కాంగ్రెస్ విమర్శించిన నేపథ్యంలో మాధవ్ ఈ మేరకు స్పందించారు.
Ram Madhav | పని లేరి వారు సృష్టించేవే..
ఎలాంటి తప్పులు కనిపించనప్పుడు కొందరు పని లేని వారు ఇలాంటి వాటిని ప్రచారంలోకి తెస్తారని రాంమాధవ్ అన్నారు. “ఈ అట్కాలే (ఊహాగానాలు) అప్పుడప్పుడు పుడతాయి. వారికి (విపక్షాలు) ఎటువంటి సమస్య కనిపించకపోతే, అప్పుడు ఇలాంటివి ప్రచారంలోకి తెస్తారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ ఉందని చెబుతారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఏక్ వైచారిక్ పరివార్ కే సంబంధ్ మే జూడ్ హుయే టూ సంఘటన్ హై (ఆర్ఎస్ఎస్, బీజేపీ ఒకే సైద్ధాంతిక గొడుగు కింద కలిసిన రెండు సంస్థలు)” అని బీజేపీ(BJP) మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వ్యాఖ్యానించారు.
Ram Madhav | అన్ని పార్టీల వారికీ సంఘ్ స్వాగతం..
బీజేపీ రాజకీయాల్లో పనిచేస్తుండగా, ఆర్ఎస్ఎస్(RSS) దాని వెలుపల సామాజిక సేవ ద్వారా పని చేస్తుందని మాధవ్ నొక్కి చెప్పారు. రాష్ట్రీయ స్వయం సంఘ్ అన్ని పార్టీల వారికి స్వాగతం పలుకుతుందని ఆయన తెలిపారు. రెండు సంస్థల మధ్య ఎటువంటి ఉద్రిక్తత లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌తో సహా అన్ని రాజకీయ నేపథ్యాల ప్రజలు సంఘ్‌లోకి రావడం స్వాగతం పలుకుతుందన్నారు.
Ram Madhav | రాజకీయ కారణాలతోనే..
మోదీ(PM Modi) ప్రసంగాన్ని, ఆర్ఎస్ఎస్‌పై ప్రశంసలను కాంగ్రెస్ తప్పుబట్టడాన్ని మాధవ్ ఖండించారు. ప్రధాని ఆర్ఎస్ఎస్ సేవలను ప్రశంసించడం స్వయంసేవకులకు స్ఫూర్తినిచ్చిందని, సంఘ్ 100 సంవత్సరాలుగా చేస్తున్న సేవకు గుర్తింపు లభించినట్లయిందన్నారు. “కొంతమంది రాజకీయ కారణాల వల్ల RSS ను ఎల్లప్పుడూ వ్యతిరేకించారు, రాజకీయ కారణాల వల్ల కాంగ్రెస్ నాయకులు ఇలా వ్యతిరేకించారు, కానీ వారికి కూడా తెలుసు RSS రాజకీయాలకు దూరంగా ఉంటూ హిందూ మతం, దేశం కోసం పనిచేస్తుందని అందరికీ తెలుసు. సంఘ్ మంచి వ్యక్తులను తయారు చేసే పనిని, మంచి మనుషులుగా తీర్చిదిద్దుతోంది. ఈ విషయమూ అందరికీ తెలుసు.” అని ఆయన అన్నారు. అయితే, ఆర్ఎస్ఎస్‌ను వ్యతిరేకిస్తే రాజకీయంగా ప్రయోజనం పొందుతామన్న భావనతోనే కాంగ్రెస్ నేతలు(Congress Leaders) భావిస్తారన్నారు.