HomeUncategorizedAlimony | మాజీ భార్యకు భరణం చెల్లించేందుకు చోరీల బాట.. తర్వాత ఏం జరిగిందంటే..!

Alimony | మాజీ భార్యకు భరణం చెల్లించేందుకు చోరీల బాట.. తర్వాత ఏం జరిగిందంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Alimony | మాజీ భార్యకు భరణం చెల్లించేందుకు ఓ వ్యక్తి దొంగగా మారాడు. భార్యాభర్తల (husband and wife) మధ్య కలహాలు వచ్చినా, ఒకరికి ఒకరు నచ్చకపోయినా విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. విడాకుల సమయంలో కోర్టులు భర్త ఆర్థిక పరిస్థితి ఆధారంగా భార్యకు నెలవారి ఖర్చుల నిమిత్తం భరణం చెల్లించాలని తీర్పులు చెబుతాయి. అయితే ఈ భరణం చెల్లించలేక ఓ వ్యక్తి చైన్​ స్నాచింగ్​లకు (chain snatching) పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నగరం (Nagpur city) గణపతినగర్‌కు చెందిన కన్హయ్య నారాయణ్ బౌరాషికి కరోనా సమయంలో వివాహం అయింది. అయితే వారి వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. దీంతో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. విడాకుల సమయంలో భార్యకు ప్రతినెలా రూ.6 వేలు భరణం కింద చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది.

Alimony | ఉద్యోగం పోవడంతో..

కన్హయ్య రెండేళ్ల క్రితం ఉద్యోగం కోల్పోయాడు. అప్పటి నుంచి తాను బతకడమే కష్టంగా ఉంది. ఈ క్రమంలో ప్రతి నెలా భార్యకు భరణం చెల్లించాల్సి రావడంతో దొంగగా మారాడు. చైన్​ స్నాచింగ్​లకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో మనీష్‌నగర్‌లో జరిగిన ఓ చైన్ స్నాచింగ్ కేసులో (chain snatching case) క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడిని అరెస్ట్​ చేశారు. గతంలో కూడా తాను గొలుసు దొంగతనాలు చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. భరణం చెల్లించడానికి చోరీలు చేస్తున్నట్లు చెప్పాడు. అతడి నుంచి పోలీసులు బైక్​, పది గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే చోరీ చేసిన బంగారం కొనుగోలు చేసిన వ్యక్తిని సైతం అరెస్ట్​ చేశారు.

Alimony | భరణంపై సోషల్​ మీడియాలో చర్చ

విడాకుల సమయంలో ఇచ్చే భరణంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. కొందరు మహిళలు పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే విడిపోయి భరణం అడగటం సరికాదని నెటిజన్లు అంటున్నారు. కొందరు దీనినే జాబ్​ గా మలుచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ మహిళ తనకు ప్రతినెలా రూ.16 లక్షల భరణం చెల్లించాలని పిటిషన్​ వేయగా.. న్యాయమూర్తి షాక్​ అయ్యారు. అంత డబ్బు ఒక నెలలో ఎలా ఖర్చు పెడతారని ప్రశ్నించారు. ఇలా చాలా మంది భరణాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. డబ్బులు చెల్లించలేక పలువురు పురుషులు ఇబ్బంది పడుతున్నారు.