అక్షరటుడే, వెబ్‌డెస్క్: producer Bunny Vasu | మరి కొద్ది రోజులలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన హరి హర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో థియేటర్స్ బంద్ (theaters close) అంటూ రచ్చ చేశారు.
తమ డిమాండ్ల సాధనకు సినిమా థియేటర్లను మూసివేస్తామని ఎగ్జిబ్యూటర్లు (exhibitors) నిర్మాతలను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా సినిమా సంఘాల ప్రతినిధులు (film association) సీఎంను కలిశారా? సినీ పెద్దలు, అగ్రనటులను వైసీపీ ప్రభుత్వం (YSRCP government) ఎలా చూసిందో, ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మరిచిపోయారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
Producer Bunny Vasu | పవన్‌నే ఇరిటేట్ చేశారు..
అయితే జూన్ 12న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ (Hari hara veeramallu) రిలీజ్ కానున్న నేపథ్యంలో కావాలనే ఇండస్ట్రీ పెద్దలు (industry leaders) ఇలాంటి కుట్రకి పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ (AP Cinematography Minister Kandula Durgesh) స్పందిస్తూ.. సమగ్ర విచారణ చేస్తామని ప్రకటించడం కలకలం రేపింది. ఆ తర్వాత వెంటనే పవన్ కార్యాలయం నుండి ప్రకటన విడుదలైంది.
దీనిపై టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు (Tollywood producer Bunny Vasu) స్పందించారు. సినిమా ఇండస్ట్రీలో (film industry) పాలిటిక్స్ చాలా సైలెంట్‌గా, చాలా లోతుగా ఉంటాయని, రాజకీయాల గొడవలతో చిత్ర పరిశ్రమ నలిగిపోతోందన్నారు. ఇండస్ట్రీ నుండి రాజకీయాల్లో వెళ్ళిన పవన్ కళ్యాణ్ కే మనం చికాకు తెప్పించామంటే.. మన మధ్య ఐక్యత ఎలా ఉందో ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ శనివారం రాత్రి ట్వీట్ చేశారు.
మరోవైపు ఈ వివాదం రచ్చగా మారుతున్న సమయంలో నిర్మాత నాగ వంశీ (producer Naga Vamsi) కూడా స్పందించారు. ఇండస్ట్రీలో జరిగే అంశాలపై స్పందించే నాగవంశీ ఈసారి ఇండస్ట్రీ పెద్దలనే టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఎక్కడా పవన్ కళ్యాణ్ (Pawan kalyan) గురించి గానీ, థియేటర్ల బంద్ అంశంపై గానీ నేరుగా ప్రస్తావించని ఆయన.. చురకలు మాత్రం బాగా అంటించారు. “దృష్టి వేరే చోట అవసరమైన టైమ్‌లో అనవసరమైన సమస్యలు సృష్టిస్తే చాలా పెద్ద సమస్యలకు దారితీస్తాయి. బుద్ధి ప్రధాన పాత్ర పోషించి ఉంటే ఈ సమస్యలను చాలా సులభంగా నివారించి ఉండేవారు” అంటూ నాగవంశీ (Naga Vamsi) ట్వీట్ చేశారు. ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారో అని ముచ్చటించుకుంటున్నారు.