అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Markets | గ్లోబల్ క్యూస్ బలహీనంగా ఉండడంతో మన మార్కెట్లు సైతం మూడు రోజుల తర్వాత నష్టాల బాటలో సాగాయి. మిడ్, స్మాల్ స్టాక్స్ ఎక్కువగా నష్టాలతో ట్రేడ్ అయ్యాయి. గురువారం ఉదయం సెన్సెక్స్ 60 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 27 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి క్రమంగా 633 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ (Nifty) 21 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 2 పాయింట్లు పెరిగింది.
అక్కడినుంచి 178 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 503 పాయింట్ల నష్టంతో 83,313 వద్ద, నిఫ్టీ 133 పాయింట్ల నష్టంతో 25,642 వద్ద స్థిరపడ్డాయి. మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది. ఆర్బీఐ (RBI) మూడు రోజుల ఎంపీసీ మీటింగ్ కొనసాగుతోంది. సమావేశ నిర్ణయాలను శుక్రవారం ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
Stock Markets | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 21,737 కంపెనీలు లాభపడగా 2,447 స్టాక్స్ నష్టపోయాయి. 158 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 75 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 94 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 6 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎసఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 2.68 లక్షల కోట్ల మేర పడిపోయింది.
Stock Markets | పీఎస్‌యూ బ్యాంక్, ఫార్మా స్టాక్స్ మినహా..
పీఎస్‌యూ బ్యాంక్, ఫార్మా స్టాక్స్ లాభాలతో ముగిశాయి. క్యాపిటల్ గూడ్స్, మెటల్, ఇండస్ట్రియల్, ఐటీ, కన్జూమర్ డ్యూరెబుల్, ఆటో రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 4 స్టాక్స్ లాభాలతో, 26 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. ట్రెంట్ 2.95 శాతం, టాటా స్టీల్ 1.23 శాతం, ఎస్బీఐ 0.50 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.11 శాతం లాభపడ్డాయి.
Top losers : ఎటర్నల్ 2.50 శాతం, ఎయిర్టెల్ 1.65 శాతం, బీఈఎల్ 1.42 శాతం, ఐటీసీ 1.15 శాతం, ఇన్ఫోసిస్ 1.05 శాతం నష్టపోయాయి.