Urea | రాష్ట్రానికి సరిపడా యూరియా సరఫరా : ఎంపీ డీకే అరుణ

అక్షరటుడే, వెబ్​డెస్క్: Urea | రాష్ట్రంలో వానాకాలం సాగు పనులు జోరందుకున్నాయి. దీంతో రైతులు ఎరువుల కొనుగోలు కోసం దుకాణాలు, సొసైటీలకు పరుగులు తీస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో యూరియా కొరత (Urea Shortage)తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యూరియా లేకపోవడంతో సొసైటీల వద్ద బారులు తీస్తున్నారు. లైన్లలో చెప్పులు, పాస్​బుక్కులు పెట్టి గంటల తరబడి యూరియా కోసం నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswhara Rao) కేంద్రానికి లేఖ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Urea | రాష్ట్రంలో వానాకాలం సాగు పనులు జోరందుకున్నాయి. దీంతో రైతులు ఎరువుల కొనుగోలు కోసం దుకాణాలు, సొసైటీలకు పరుగులు తీస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో యూరియా కొరత (Urea Shortage)తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యూరియా లేకపోవడంతో సొసైటీల వద్ద బారులు తీస్తున్నారు. లైన్లలో చెప్పులు, పాస్​బుక్కులు పెట్టి గంటల తరబడి యూరియా కోసం నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswhara Rao) కేంద్రానికి లేఖ రాశారు.

రాష్ట్రానికి యూరియా కేటాయించాలని ఆయన కోరారు. రాష్ట్రానికి ఏప్రిల్​, మే, జూన్​ నెలల్లో ఐదు లక్షల మెట్రిక్​ టన్నుల యూరియా కోటాను కేంద్రం నిర్దేశిస్తే ఇప్పటివరకు 3.06 లక్షలు మాత్రమే వచ్చిందన్నారు. వెంటనే యూరియా సరఫరా చేయాలని ఆయన లేఖలో కోరారు. కాగా యూరియా సరఫరాపై బీజేపీ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) స్పందించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సరిపడా యూరియా సరఫరా అవుతుందన్నారు. ఇప్పటికే 12 లక్షల టన్నుల యూరియా వచ్చిందని ఆమె పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని డీకే అరుణ సూచించారు.

Related articles

February 26 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

February 26 Panchangam | తేదీ (DATE) – ఫిబ్రవరి 26,​ 2026 పంచాంగం (today horoscope) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

Alphazolam seized | నిషేధిత ఆల్ఫాజోలం పట్టివేత.. విలువ రూ. 1.60 లక్షలపైనే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Alphazolam seized | నిజామాబాద్​ జిల్లాలోని జోజిపేట్​లో నిషేధిత ఆల్ఫాజోలం పట్టుబడింది. నిజామాబాద్​ నార్కొటిక్​ ఇన్​స్పెక్టర్​ Narcotics Inspector పూర్ణేశ్వర్​, నందిపేట్​...

Deputy Collectors transfers | తెలంగాణలో 16 మంది డిప్యూటీ కలెక్టర్​ల బదిలీ

అక్షరటుడే, హైదరాబాద్​: Deputy Collectors transfers | తెలంగాణ Telangana రెవెన్యూ శాఖలో బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది అదనపు కలెక్టర్లు,...

PM Narendra Modi | ఇజ్రాయెల్‌ పౌరుల హత్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేం : ప్రధాని మోడీ

అక్షరటుడే, న్యూఢిల్లీ: PM Narendra Modi | గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌ ఉగ్రవాదంతో పోరాడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ Prime Minister...