అక్షరటుడే, వెబ్డెస్క్ : SE Caught by ACB | అవినీతి అధికారులు మారడం లేదు. కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చే వారిని లంచాలు డిమాండ్ చేస్తున్నారు. సామాన్య ప్రజల నుంచి మొదలుకొని కాంట్రాక్టర్ల వరకు ఎవరిని వదలడం లేదు. ప్రతి పనికి ఓ రేటు కట్టి వసూలు చేస్తున్నారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కూకట్పల్లి జీహెచ్ఎంసీ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. భారీ అవినీతి తిమింగలాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కూకట్పల్లి జోన్ (Kukatpally Zone) ఎస్ఈ చిన్నారెడ్డి రూ.15 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో, అతడి నివాసంలో అధికారులు సోదాలు చేశారు. సదరు ఎస్ఈ ఓ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఆయన ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో లంచం తీసుకుంటుండగా ఎస్ఈ చిన్నారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
SE Caught by ACB | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఏసీబీ వెబ్సైట్ (ACB Website) ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.