అక్షరటుడే, బీర్కూర్ : Birkur Mandal | మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాఫూలే గ్రౌండ్‌లో (Mahatma Jyotiba Phule Ground) ఆపిశెట్టి ప్రదీప్ స్మారక క్రికెట్ టోర్నమెంట్‌ను (Pradeep Memorial Cricket Tournament) ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మాతేజ, ఉపసర్పంచ్ పరమేష్ పంతులు, మాజీ ఎంపీటీసీ సందీప్ పటేల్, యూత్ కాంగ్రెస్ నాయకులు మియాపూరం శశికాంత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ప్రదీప్ పటేల్‌ను స్మరిస్తూ రెండు నిమిషాల మౌనం పాటించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ అరిగే ధర్మతేజ, మాజీ ఎంపీటీసీ సందీప్ పటేల్ (Sandeep Patel) బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంలో ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో ఉపయోగపడతాయని, ప్రదీప్ పటేల్ జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఈ పోటీలు యువతకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో బాల్ రాజ్, శివ, భవాని, కుర్రి కృష్ణ, తరుణ్, నాగు, రాకేష్, అంజద్, కోరిమె రఘు, గాండ్ల సంతోష్ కుమార్, ప్రేమ్ పటేల్, మారుతీ పటేల్, ప్రశాంత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.