అక్షరటుడే ఇందూరు: OPS | ఉద్యోగ ఉపాధ్యాయాలకు పాత పెన్షన్ విధానాన్ని(OPS) వర్తింపజేయాలని 2003 ఉద్యోగ, ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆదివారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు (PCC Chief Bomma) వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా, అలాగే ఇటీవల హైకోర్టు (Highcourt) ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరారు. ఇప్పటికే అనేకసార్లు ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించామన్నారు.
ఈ మేరకు మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందించారని, న్యాయమైన డిమాండ్ ను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వినతి పత్రం అందించిన వారిలో సమితి నాయకులు అర్గుల సత్యం, సురేందర్, స్వప్న, విజయ్ కుమార్, రామకృష్ణ, ప్రసాద్, గంగాధర్, విఠల్, మోహన్, మురళి తదితరులు పాల్గొన్నారు.