అక్షరటుడే, ఎల్లారెడ్డి : MLA Madan Mohan | మండలంలో కొత్త సర్పంచులు గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సూచించారు. ఎల్లారెడ్డి (Yellareddy) మున్సిపల్ మాజీ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం గెలిచిన సర్పంచ్లు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సర్పంచులను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శాలువాలతో సన్మానించి అభినందించారు.
MLA Madan Mohan | శక్తివంచన లేకుండా కృషి చేయాలి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి నూతన సర్పంచులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ (Congress Party) కట్టుబడి ఉందని ఆయన సూచించారు. ఎమ్మెల్యేను హైదరాబాద్లో (Hyderabad) కలిసిన వారిలో సబ్దల్పూర్ సర్పంచ్ స్వప్న సాయిలు, మల్లయ్యపల్లి సర్పంచ్ లక్ష్మి మైసయ్య, రేపల్లెవాడ సర్పంచ్ దుద్ధుల వనిత సాయిరామ్, అల్మాజీపూర్ సర్పంచ్ దత్తు, దవల్ మల్కపల్లి సర్పంచ్ దీవెన రవీందర్లు ఉన్నారు. కార్యక్రమంలో మాచాపూర్ ఎంపీటీసీ పడమటి సంతోష్ కుమార్, ఈశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.