HomeతెలంగాణBogatha Waterfalls | పరవళ్లు తొక్కుతున్న తెలంగాణ నయాగరా.. కనుల విందు చేస్తున్న బొగత జలపాతం

Bogatha Waterfalls | పరవళ్లు తొక్కుతున్న తెలంగాణ నయాగరా.. కనుల విందు చేస్తున్న బొగత జలపాతం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bogatha Waterfalls | తెలంగాణ నయాగరా.. బొగత జలపాతం(Bogatha Waterfalls) పరవళ్లు తొక్కుతోంది. వర్షాలతో భారీగా వరద రావడంతో జలపాతం కనువిందు చేస్తోంది. ములుగు జిల్లా (Mulugu District) వ్యాప్తంగా మంగళవారం నుంచి భారీ వర్షం పడుతోంది. దీంతో బొగత జలపాతానికి వరద పోటెత్తింది. జలసవ్వడులతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది. అయితే వర్షాలు కొనసాగుతుండడంతో జలపాతాన్ని చూడడానికి అధికారులు పర్యాటకులను అనుమతించడం లేదు.

Bogatha Waterfalls | దంచి కొడుతున్న వాన

ములుగు జిల్లా వ్యాప్తంగా వాన దంచి కొడుతోంది. వెంకటాపూర్ (Venkatapur)​ మండలంలో రికార్డు స్థాయిలో 265 మి.మీ వర్షపాతం నమోదైంది. వాజేడు మండలం పేరూరులో 30.4 మి.మీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు ఉధృతంగా పారుతున్నాయి. ఈ క్రమంలో బొగత జలపాతం పొంగిపొర్లుతూ కనువిందు చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Akshara Today (@aksharatoday)