అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Arattai App | ఇండియన్ మెసెజింగ్ యాప్ ఆరట్టై దూసుకుపోతోంది. రోజుకు నాలుగు లక్షల డౌన్లోడ్లతో ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం దేశంలో వాట్సాప్‌కు ఉన్న క్రేజ్ తెలిసిందే. స్మార్ట్‌ఫోన్ (Smart Phone) ఉన్న ప్రతి ఒక్కరు దీనిని వినియోగిస్తున్నారు.
అయితే ఇటీవల అమెరికా భారత్‌పై సుంకాలు విధించడంతో ప్రధాని మోదీ స్వదేశీ వస్తువులనే వాడాలని సూచించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Union Minister Dharmendra Pradhan) వాట్సాప్‌కు బదులుగా ఆరట్టైని వినియోగించాలని సూచించారు. దీనికి తోడు సోషల్ మీడియాలో సైతం ఆరట్టై యాప్ వైరల్ అయింది. దీంతో డౌన్లోడ్లు ఊపందుకున్నాయి.
Arattai App | తమిళనాడు సంస్థ
తమిళనాడు(Tamilnadu)కు చెందిన జోహో అనే సంస్థ ఈ యాప్‌ను 2021లోనే రూపొందించింది. అప్పటి నుంచి యాప్ అందుబాటులో ఉన్నా.. ఈ మధ్య మాత్రం ట్రెండింగ్ అయింది. అక్టోబర్ 3 నాటికి ఈ యాప్‌ను 75 లక్షల మందికిపైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఆపిల్ స్టోర్లలో ఉంది. అయితే ఆండ్రాయిడ్ యూజర్లే ఎక్కువగా దీనిని డౌన్లోడ్ చేసుకుంటున్నారు.
Arattai App | అన్నీ ఫీచర్లు..
వాట్సాప్(Whats App)కు పోటీగా గతంలో స్నాప్ చాట్, టెలిగ్రామ్‌లాంటి యాప్‌లు వచ్చాయి. అయితే అవి దానిని దాటి పోలేకపోయాయి. తాజాగా ఆరట్టై మాత్రం వాట్సాప్‌ను ఢీకొట్టేలా కనిపిస్తోంది. దీనికి కారణం వాట్సాప్‌లో ఉండే అన్ని ఫీచర్లు దీనిలో ఉండడం. వాట్సాప్ ఓల్డ్ ఆండ్రాయిడ్ వర్షన్లలో పని చేయదు. కానీ ఆరట్టై మాత్రం అన్ని వర్షన్లలో పని చేస్తుంది. దీంతో దీనికి క్రేజ్ పెరిగింది. నెట్ స్పీడ్ తక్కువగా ఉన్నా.. ఈ యాప్ బాగా పని చేస్తుంది. లో కనెక్టివిటీలోనూ ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు.
Arattai App | టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు..
ప్రస్తుతం వాట్సాప్‌ను వెబ్ బ్రౌజర్లో కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఆరట్టై మాత్రం టీవీలో సైతం కనెక్ట్ చేసుకునే ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని కోసం యాప్‌లో ఆండ్రాయిడ్ టీవీ ఆప్షన్‌ను పెట్టారు. దీంతో పాటు జూమ్ తరహా మీటింగ్ నిర్వహించుకునే సౌకర్యం కూడా ఉంది. దీంతో చాలా మంది భారతీయులు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు.
Arattai App | ఆరట్టై ఒకటే కాదు..
జోహో సంస్థ ఆరట్టై యాప్(Aarattai App)ను మాత్రమే కాకుండా చాలా యాప్‌లను డెవలప్ చేసింది. జోహో ఉలా, జోహో మెయిల్, ఇండస్ యాప్‌స్టోర్, బాస్ ఓఎస్ లాంటి ప్రొడక్టులను అభివృద్ధి చేసింది. ప్రైవసీకి పెద్దపీట వేస్తూ.. దేశీయ వినియోగదారుల కోసం వీటిని రూపొందించింది. కాగా.. జోహో ఉలా గూగుల్, గూగుల్ క్రోమ్ వంటి బ్రౌజర్. జోహో షూట్ మైక్రోసాఫ్ట్‌లో వర్డ్, ఎక్సెల్, మెయిల్‌లాంటి సదుపాయాలు ఉంటాయి. జోహో కూడా అలాంటి వాటిని డెవలప్ చేసింది. జోహో మెయిల్, వర్క్ డ్రైవ్ (స్టోరేజ్), షో, రైటర్, షీట్స్, మీటింగ్, ఫామ్స్, క్యాలెండర్‌లాంటి వాటిని రూపొందించింది.
Arattai App | సెపరేట్ ఓఎస్ సైతం..
జోహో సొంతంగా ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)ను సైతం అభివృద్ధి చేసింది. ప్రస్తుతం కంప్యూటర్లలో విండోస్, మ్యాక్ ఓఎస్‌నే చాలా మంది వినియోగిస్తున్నారు. భారత్ ఆపరేటింగ్ సిస్టమ్ సొల్యూషన్స్ (బాస్ ఓఎస్) పేరిట దీనిని రూపొందించింది. ప్లే స్టోర్‌కు పోటీగా ఇండస్ యాప్ స్టోర్‌ను తయారు చేసింది.