అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Piyush Goyal on Trade deal | భారత్-యూఎస్ ట్రేడ్ డీల్ (India-US trade deal)తో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ ఒప్పందంతో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుందని చెప్పారు. ట్రేడ్ డీల్‌పై విపక్షాలవి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. లోక్‌సభలో విపక్షాలు దురుసుగా ప్రవర్తించాయన్నారు. ట్రేడ్ డీల్ విషయంలో రాహుల్‌గాంధీ ద్వంద్వ వైఖరి ప్రదర్శించారని దుయ్యబట్టారు. వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన వివరాలను ఖరారు చేసే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. రాబోయే కొద్ది రోజుల్లో ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నారు.
Piyush Goyal on Trade deal | వాటికి రక్షణ కల్పిస్తాం
వ్యవసాయం (Agriculture), పాడి పరిశ్రమ వంటి “సున్నితమైన” రంగాలకు రక్షణ కల్పిస్తామని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. తాము జాతీయ ప్రయోజనాలకే కట్టుబడి ఉన్నామన్నారు. 140 కోట్ల మంది భారతీయులు ఈ వాణిజ్య ఒప్పందం గురించి సంతోషిస్తున్నారని తెలిపారు. ఈ ఒప్పందం ఇరు దేశాల చర్చల బృందాల మధ్య తుది దశలో ఉందని ఆయన వెల్లడించారు. ఒప్పందంపై తుది అవగాహన కుదిరి, సాంకేతిక ప్రక్రియలు పూర్తయిన వెంటనే పూర్తి వివరాలు పంచుకుంటామన్నారు.
ఈ ఒప్పందం భారతదేశ శ్రమతో కూడిన రంగాలైన సముద్ర ఉత్పత్తులు, ప్లాస్టిక్లు, రబ్బరు వస్తువులు, యంత్రాలు, విమాన భాగాలు, రత్నాలు మరియు ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువులు మరియు వస్త్ర రంగాల నుండి ఎగుమతులకు భారీ అవకాశాలను తెరుస్తుందని గోయల్ హైలైట్ చేశారు.