Homeజిల్లాలునిజామాబాద్​Paddy centers | రైతులు పండించిన ప్రతిగింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది..

Paddy centers | రైతులు పండించిన ప్రతిగింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది..

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సొసైటీ ఛైర్మన్లు పేర్కొంటున్నారు. ఆలూర్​ మండలంలోని మచ్చర్ల, దేగాం సొసైటీల్లో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Paddy centers | రైతులు పండించిన ప్రతిగింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మచ్చర్ల సొసైటీ ఛైర్మన్​ తాంబూరి శ్రీనివాస్​ అన్నారు. ఆలూర్ మండలం కేంద్రంలోని (Aloor mandal center) మచ్చర్లలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మండలంలో కొనుగోలు కేంద్రాలను (purchase centers) ఏర్పాటు చేస్తోందని తెలిపారు. రైతులు ఈ కేంద్రాల ద్వారా మద్దతు ధర పొందాలని, తగిన తేమ శాతం ఉన్న స్వచ్ఛమైన ధాన్యాన్ని మాత్రమే కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.

Paddy centers | దళారులను ఆశ్రయించవద్దు..

దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ కేంద్రాల్లో (government centers) ధాన్యం విక్రయించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులు పండించిన ప్రతిగింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని వివరించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ ఛైర్మన్ చేపూర్ రాజేశ్వర్, ఆర్మూర్ ఏఎంసీ డైరెక్టర్ మల్లారెడ్డి, డైరెక్టర్లు ప్రమోద్, బార్ల సంతోష్ రెడ్డి, అరె రాజేశ్వర్, కట్ట నర్సయ్య, వెల్మ నర్స రెడ్డి, పచ్చుక నాగన్న, కళ్లెం సాయ రెడ్డి, కళ్లెం బొజ రెడ్డి ఇంగు గోవర్ధన్,సింగిడి మల్లు బాయి వీడీసీ సభ్యులు సీఈఓ మల్లేష్ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

Paddy centers | దేగాంలో..

అక్షరటుడే, ఆర్మూర్: ఆలూర్ మండలంలోని దేగాం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని (paddy purchase center) బుధవారం సొసైటీ వైస్ ఛైర్మన్ రాజేశ్వర్, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ దేగాం ప్రమోద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మండలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు.

దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో మల్లేష్, డీపీవో సదానందం, డైరెక్టర్ రాజేశ్వర్, పంచాయతీ సెక్రెటరీ నవీన్, సిబ్బంది ముత్యం, వీడీసీ సభ్యులు మూతన్న, కన్కా గౌడ్, పొట్టన్న, రవి తదితరులు పాల్గొన్నారు.