అక్షరటుడే, ఆర్మూర్ : Armoor MLA | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు లక్ష్యoగా పని చేయాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) అన్నారు. ఆలూర్ మండలకేంద్రంలో (Alur Mandal Center) శుక్రవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త వ్యక్తిగత అభిప్రాయాలను పక్కనపెట్టి, పార్టీ అభ్యర్థి ఎవరైనా కలిసికట్టుగా పని చేయాలన్నారు. మండల స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుర శ్రీకాంత్, మరంపల్లి గంగాధర్, నూతల శ్రీనివాస్ రెడ్డి, కొత్తూరు గంగాధర్, గిరీష్, డాక్టర్ అరుణ్, హర్ష హరీష్, రామ్ రెడ్డి, మోతే శ్రావన్య, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.
