ePaper
More
    Homeటెక్నాలజీApple Foldable iPhone | ఆపిల్ నుంచి తొలి ఫోల్డ‌బుల్ ఫోన్‌.. 2026 నాటికి వ‌చ్చే...

    Apple Foldable iPhone | ఆపిల్ నుంచి తొలి ఫోల్డ‌బుల్ ఫోన్‌.. 2026 నాటికి వ‌చ్చే అవ‌కాశం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Apple Foldable iPhone | ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ ఆపిల్ నుంచి త‌న తొలి ఫోల్డ‌బుల్ ఐఫోన్‌ను తీసుకురావ‌డంపై దృష్టి సారించింది. 2026 నాటికి ఈ ఫోన్‌ను విక్ర‌యించ‌నున్న‌ట్లు తెలిసింది. ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌(Apple Foldable iPhone)ను అభివృద్ధి చేసే ప్రక్రియలో ఉన్నట్లు సోషల్ మీడియా పోస్ట్‌ల నుంచి వివిధ మీడియా సంస్థల నివేదికల వరకు వివిధ లీక్‌లు వెలువడ్డాయి. ఈ నేప‌థ్యంలోనే ఈ ఫోన్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ వెలువడింది. ఆపిల్ తన మొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను 2026 లో ప్రవేశపెట్టవచ్చని తెలిసింది. మొదటి ఫోల్డబుల్ ఐఫోన్ ఉత్పత్తిని ప్ర‌స్తుత‌ సంవత్సరం మూడో త్రైమాసికంలో, ముఖ్యంగా జూలై లేదా సెప్టెంబర్ మధ్య ప్రారంభమ‌య్యే అవ‌కాశ‌ముంద‌ని ప్రసిద్ధ విశ్లేషకుడు మింగ్-చి కువో(Ming-Chi Kuo) తెలిపారు. అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే, జూలై 2026 లో లాంచ్ జరగవచ్చని వెల్ల‌డించారు. ఆపిల్ ఈ వినూత్న ఫోన్‌ను త‌యారు చేసే పనిని ఫాక్స్‌కాన్‌(Foxconn)కు అప్పగించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

    Apple Foldable iPhone | ఫోల్డబుల్ ఫోన్‌లో కీల‌కాంశాలు.

    ఆపిల్ రూపొందించ‌నున్న ఫోల్డ‌బుల్ ఫోన్‌కు సంబంధించి కొన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. బుక్-స్టైల్ డిజైన్‌(Book-style design)లో రానున్న తొలి ఫోల్డబుల్ ఐఫోన్ 7.8 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంద‌ని భావిస్తున్నారు. మెటాలిక్ గ్లాస్(Metallic glass), స్టెయిన్‌లెస్ స్టీల్(stainless steel) అల్యూమినియం కలయికను ఎంచుకోవచ్చ‌ని చెబుతున్నారు. వెనుక భాగంలో డ్యూయల్-కెమెరా సెటప్‌తో పాటు 5.8-అంగుళాల ఔటర్ డిస్‌ప్లే, సెల్ఫీల కోసం ఫ్రంట్ కెమెరా, అలాగే పవర్ బటన్‌లో ఇంటిగ్రేట్ చేయబడిన టచ్ ID ఫీచర్ ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి, ఆపిల్ ఇంకా ఫోల్డబుల్ ఐఫోన్ గురించి నిర్దిష్ట వివరాలను విడుదల చేయలేదు. అయితే, దీని ధర 2 వేలనుంచి 2,500 డాల‌ర్ల (సుమారు రూ. 1.73 లక్షల నుంచి రూ. 2.16 లక్షలు) మధ్య ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్ర‌త‌స్తుం వెలువ‌డుతున్న క‌థ‌నాల‌ ప్ర‌కారం.. కంపెనీ సుమారు 15 నుంచి 20 మిలియన్ యూనిట్ల ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు.

    More like this

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...