ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​CM Chandrababu | దేశం మొత్తం మోదీ వెంట ఉంది : చంద్రబాబునాయుడు

    CM Chandrababu | దేశం మొత్తం మోదీ వెంట ఉంది : చంద్రబాబునాయుడు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:CM Chandrababu | ఉగ్రవాద నియంత్రణకు కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు మేం అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్​లోని ఐదు కోట్ల మందే కాదు.. దేశం మొత్తం మీ వెంట ఉందని వ్యాఖ్యానించారు. అమరావతి సభలో ఆయన మాట్లాడారు. పహల్​గామ్​లో అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు(Terrorists) కిరాతకంగా చంపారన్నారు. ఉగ్రదాడి తర్వాత తాను ప్రధాని మోదీ(Modi)ని కలిశానన్నారు. ఎప్పుడూ ఆహ్లాదంగా కనిపించే ఆయన ఆ సమయంలో గంభీరంగా ఉన్నారన్నారు.  దేశంలో ఉగ్రవాద నియంత్రణ(Terrorism Control)కు కేంద్రం తీసుకునే ప్రతి చర్యకైనా మేం మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.

    CM Chandrababu | మోదీకి నేషన్​ ఫస్ట్​

    ప్రధాని మోదీ(Prime Minister Modi)కి దేశమే ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. దేశానికి సరైన సమయంలో సరైన ప్రధానిగా మోదీ ఉన్నారన్నారు. దేశ ప్రజలంతా ఆయనను అభిమానిస్తున్నారని చెప్పారు. మోదీ ప్రధాని కాక ముందు ఆర్థికంగా దేశం 10వ స్థానంలో ఉండేదని.. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో నాలుగో స్థానంలోకి వస్తుందని ఐఎంఎఫ్​(IMF) తెలిపిందన్నారు. వికసిత్​ భారత్​ కేవలం ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమన్నారు. సంక్షేమం, అభివృద్ధి, ఎంపవర్​మెంట్​(Empowerment)లే మోదీ విధానమని తెలిపారు. దేశాభివృద్ధి కోసం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సీఎం తెలిపారు. కులగణన(Caste Census) గేమ్​ ఛేంజర్​ అవుతుందని వ్యాఖ్యానించారు.

    CM Chandrababu | అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తాం

    అమరావతి(Amaravati) రాజధాని నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు(CM Chandrababu) తెలిపారు. రాజధాని కోసం 34వేల ఎకరాలను రైతులు(Farmers) ల్యాండ్​ పూలింగ్​ కింద ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్​ను తుడిచిపెట్టిందన్నారు. అమరావతి రైతులు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. అమరావతిని మళ్లీ పట్టాలెక్కించామని పేర్కొన్నారు. మోదీ గైడెన్స్​తో అమరావతిని ప్రపంచం మెచ్చే రాజధానిగా రూపొందిస్తామని స్పష్టం చేశారు.

    More like this

    Sub Collector Vikas Mahato | పీహెచ్​సీ సబ్​సెంటర్​ నిర్మాణం కోసం స్థల పరిశీలన

    అక్షరటుడే, కోటగిరి: Sub Collector Vikas Mahato | పోతంగల్ (Pothangal)​ మండలంలోని హెగ్డేలి(Hegdely) గ్రామానికి మంగళవారం బోధన్​...

    Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​.. పార్టీకి సొసైటీ ఛైర్మన్​ రాజీనామా

    అక్షరటుడే, బోధన్​: Maggari Hanmandlu | జిల్లాలో బీఆర్​ఎస్ (Brs Nizamabad)​ పార్టీలో తొలి రాజీనామా నమోదైంది.  కేసీఆర్​...

    Nepal PM Resigns | నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal PM Resigns | నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి...