Police Summar Camp | తల్లిదండ్రులను గౌరవించాలి

అక్షరటుడే, ఇందూరు: Police Summar Camp | తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకున్నప్పుడే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని జిల్లా జడ్జి జీవీఎన్​ భరతలక్ష్మి(Judge GVN Bharathalakshmi) పేర్కొన్నారు. కమిషనరేట్​ పరిధిలో పోలీస్​శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్​క్యాంప్​ ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. క్యాంప్​లో విద్యార్థినులకు ఈవ్​టీజింగ్​ను ఎదుర్కొనే మెళకువలు నేర్పించడం అభినందనీయమన్నారు. కేరీర్​ బిల్డప్​ (Career Buildup) కంటే క్యారక్టర్​ బిల్డప్ (Character Buildup)​ అనేది చాలా ముఖ్యమైందన్నారు. అనంతరం పోలీస్​ కమిషనర్​ సాయి చైతన్య (Police Commissioner […]

అక్షరటుడే, ఇందూరు: Police Summar Camp | తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకున్నప్పుడే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని జిల్లా జడ్జి జీవీఎన్​ భరతలక్ష్మి(Judge GVN Bharathalakshmi) పేర్కొన్నారు. కమిషనరేట్​ పరిధిలో పోలీస్​శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్​క్యాంప్​ ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. క్యాంప్​లో విద్యార్థినులకు ఈవ్​టీజింగ్​ను ఎదుర్కొనే మెళకువలు నేర్పించడం అభినందనీయమన్నారు. కేరీర్​ బిల్డప్​ (Career Buildup) కంటే క్యారక్టర్​ బిల్డప్ (Character Buildup)​ అనేది చాలా ముఖ్యమైందన్నారు.

అనంతరం పోలీస్​ కమిషనర్​ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya) మాట్లాడుతూ.. ప్రధానంగా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఈ క్యాంప్​ నిర్వహిస్తున్నామన్నారు. క్యాంప్​లో విద్యార్థినులకు తైక్వాండో (Taekwondo), సెల్ఫ్​ డిఫెన్స్ (Self-defense)​ శిక్షణనిచ్చామన్నారు. వేసవి సెలవును సద్వినియోగం చేసుకుని లక్ష్యంవైపు దూసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపీఎస్​ సాయికిరణ్​, సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్, రిటైర్డ్ ఇన్​స్పెక్టర్​ కిషన్, తైక్వాండో ట్రెయినర్ మనోజ్, జేసీఐ సభ్యులు విజయానంద్, ఆర్​బీవీఆర్​ఆర్​ సొసైటీ సభ్యులు మహేందర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...