అక్షరటుడే, కామారెడ్డి: Drunk driving | రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు నిరంతరం డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తూ జరిమానాలు విధిస్తున్నా మందుబాబుల్లో మార్పు రావడం లేదు. ఫలితంగా రోజుకు పదుల సంఖ్యలో పోలీసులకు చిక్కి న్యాయస్థానాల్లో జరిమానాలు కట్టడమే కాకుండా జైలుకు సైతం వెళ్తున్నారు.
Drunk driving | రెండురోజుల తనిఖీల్లో..
జిల్లాలో రెండు రోజులుగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో 106 మంది పట్టుబడ్డారు. వీరిని కోర్టుకు (Kamareddy Courts) తరలించగా రూ.1.07 లక్షల జరిమానా విధించారు. ఇందులో 20 మందికి ఒకరోజు జైలుశిక్ష కూడా విధిస్తూ తీర్పునిచ్చింది. కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మందికి ఒకరోజు జైలు శిక్ష, రూ.1000 చొప్పున జరిమానా, దేవునిపల్లి పరిధిలో ఇద్దరికి, మాచారెడ్డి పరిధిలో ఒకరికి జైలుశిక్ష విధించారు. అలాగే రామారెడ్డి పరిధిలో ఇద్దరికి, దోమకొండ పరిధిలో ఒకరికి, తాడ్వాయి పరిధిలో ముగ్గురికి ఒకరోజు జైలుశిక్షతో పాటు రూ.వెయ్యి చొప్పున కోర్టు జరిమానా విధించింది.
కామారెడ్డి పోలీస్ స్టేషన్ (Kamareddy Police station) పరిధిలో 27 మందికి, దేవునిపల్లి(Devunipally) పరిధిలో 30 మందికి, మాచారెడ్డి పరిధిలో ఐదుగురికి, రామారెడ్డి పరిధిలో ఇద్దరికి, భిక్కనూరు పరిధిలో ఏడుగురికి జరిమానా విధించారు. అలాగే దోమకొండ పరిధిలో నలుగురికి, బీబీపేట పరిధిలో ముగ్గురికి, సదాశివనగర్ పరిధిలో నలుగురికి, తాడ్వాయి పరిధిలో ముగ్గురికి, రాజంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరికి రూ.1000 చొప్పున న్యాయస్థానం జరిమానా విధించింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడపవద్దన్నారు. ఒకరి నిర్లక్ష్యం మరికొందరి ప్రాణాలు పోవడానికి కారణం కాకూడదని తెలియజేశారు.