అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy Municipal Candidates | ఎల్లారెడ్డిలో పురపోరు రసవత్తరంగా సాగనుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
పట్టణంలో 12 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి చాలా మంది టికెట్ ఆశించారు. ఆ రెండు పార్టీల నుంచి 58 మంది నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో మంగళవారం నామినేషన్ల (nominations) ఉపసంహరణకు చివరి రోజు కావడంతో పార్టీ నాయకులు టికెట్లు ఖరారు చేశారు. బీ ఫాంలు పంపిణీ చేశారు. అంతేగాకుండా టికెట్ దక్కని వారిని బుజ్జగించి నామినేషన్ ఉపసంహరించుకునేలా (withdrawal of nominations) చేశారు. దీంతో పలువురు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పట్టణంలో మొత్తం 45 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి 12 మంది చొప్పున 36 మంది, ఏడుగురు స్వతంత్రులు, ఇద్దరూ బీఎస్పీ తరఫున బరిలో నిలిచారు.
Yellareddy Municipal Candidates | కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..
కాంగ్రెస్ (Congress party) తరఫున ఒకటో వార్డులో తమ్మల గాయత్రి, 2 వార్డులో మంచిర్యాల మహేశ్వరి, 3వ వార్డులో కౌసర్ ఉన్నిసా, 4వా వార్డులో దుంపల మంజుల, 5వ వార్డులో అట్కరి చంద్రయ్య, 6వ వార్డులో సయ్యద్ గఫర్, 7వ వార్డులో మత్తమాల భాగ్యవతి, 8 నునుగొండ శ్రీనివాస్, 9 గాదే తిరుపతి, 10వ వార్డులో పద్మ శ్రీకాంత్, 11వ వార్డులో స్వప్న, 12వ వార్డులో ఎరుకల దశరథం పోటీ చేస్తున్నారు.
Yellareddy Municipal Candidates | బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన వారు
బీఆర్ఎస్ నుంచి 1వ వార్డులో అల్లం ప్రసీల, 2వ వార్డులో మంగలి పద్మ, 3వ వార్డులో జీనత్ సుల్తానా, 4వ వార్డులో ముస్త్యాల సుజాత, 5వ వార్డులో చర్ల దేవయ్య, 6వ వార్డులో బ్యాగరి మహేందర్, 7వ వార్డులో మంగలి కావ్య, 8వ వార్డులో మధురి అజయ్, 9 మొహమ్మద్ నయీమ్, 10వ వార్డులో మమ్మద్ యూనిస్, 11 రామగల లక్ష్మి, 12వ వార్డులో ఎరుకల సాయిలు బరిలో నిలిచారు.
Yellareddy Municipal Candidates | బీజేపీ తరఫున..
బీజేపీ నుంచి 1వ వార్డు అల్లం స్వరూప, 2 మాధురి, 3వ వార్డులో విజయ, 4వ వార్డులో గోదావరి, 5 సాయిబాబా, 6 దేవేందర్, 7వ వార్డులో శిరీష, 8వ వార్డులో శంకర్, 9 సుజాత, 10వ వార్డులో రాజేష్, 11వ వార్డులో లక్ష్మి, 12వ వార్డులో కేతావత్ రవి పోటీ చేస్తున్నారు. 8వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా సిద్ధి శ్రీధర్ గుప్తా బరిలో ఉన్నారు. పలువురు స్వతంత్ర, బీఎస్పీ అభ్యర్థులు సైతం పోటీలో నిలిచారు. దీంతో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది.