అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bandi Sanjay on Vemulawada | కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతున్నారు. తన పార్లమెంట్ పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్‌లలో ప్రచారం చేశారు.
వేములవాడ (Vemulawada) పట్టణంలోని నాంపల్లి, తిప్పాపూర్, అంజనీ నగర్, మహంకాళి చౌరస్తాలో బీజేపీ (BJP) అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ. వేములవాడ రాజన్నకే శఠగోపం పెట్టిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా గుడిని కడుతూ కాంగ్రెస్ మరో పాపం చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం వేములవాడలో అభివృద్ధి పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయని బీఆర్ఎస్, రెండేళ్లు అధికారంలో ఉండి వేములవాడకు రూపాయి ఇవ్వని కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.
Bandi Sanjay on Vemulawada | కేంద్రం నుంచి నిధులు
వేములవాడకు 14, 15 ఆర్థిక సంఘాల నుంచి రూ.16 కోట్లు తెచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు రూ.4 కోట్ల ఎంపీ లాడ్స్ నిధులు, అమృత్ పథకం (Amrit Scheme) కింద రూ.13 కోట్లు, స్వనిధి కింద 4 వేల మంది చిరు వ్యాపారులకు రూ.6 కోట్లకు పైగా నిధులు ఇప్పించానని చెప్పారు. పేద విద్యార్థులకు 20 వేల సైకిళ్లు పంపిణీ చేశానని గుర్తు చేశారు. ప్రభుత్వాసుపత్రులకు రూ.2 కోట్ల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను అందించానన్నారు. వేములవాడ సమగ్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించి, వేములవాడ మున్సిపల్ పీఠాన్ని కమలం పార్టీకి అప్పగించాలని కోరారు.
Bandi Sanjay on Vemulawada | సిరిసిల్లలో..
సిరిసిల్ల (Sircilla)లో పేదలకు ఇండ్లు, యువతకు కొలువులు ఇయ్యలేదని బండి సంజయ్ అన్నారు. కానీ ప్రశ్నించిన తన మీద మాత్రం 109 కేసులు పెట్టించి కేసీఆర్, కేటీఆర్ ఇబ్బందులు పెట్టారన్నారు. తాను తండ్రి పేరు చెప్పి రాజకీయాల్లోకి రాలేదని కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశం కోసం, ధర్మం కోసం అనే నినాదంతో కొట్లాడి వచ్చానని చెప్పారు. ఇప్పటికీ లీగల్ నోటీసులతో భయపెట్టాలి అనుకుంటున్నారని విమర్శించారు. సిరిసిల్ల చౌరస్తాలో అంబేడ్కర్ పాదాలపై ప్రమాణం చేసి, చేసిన పాపాలపై నిజం చెప్పే దమ్ముందా అని ఆయన కేటీఆర్‌కు సవాల్ విసిరారు.