అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Congress coordinators | మున్సిపల్ ఎన్నికలపై (Municipal Elections) కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా తాజాగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు (municipalities and corporations) కో–ఆర్డినేటర్లను నియమించింది.
రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల కోసం కో–ఆర్డినేటర్లను నియమిస్తూ తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (PCC President Mahesh Kumar Goud) ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో మున్సిపాలిటీకి ఒకరిని కో–ఆర్డినేటర్‌గా నియమించారు. నిజామాబాద్ కార్పొరేషన్‌కు నలుగురిని, కరీంనగర్ కార్పొరేషన్‌కు ఇద్దరిని, కొత్తగూడెం కార్పొరేషన్‌కు ముగ్గురిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పలు మున్సిపాలిటీలకు ఇద్దరిని కో–ఆర్డినేటర్లుగా నియమించారు.
Congress coordinators | గెలుపే లక్ష్యంగా..
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే జిల్లాల వారిగా మంత్రులకు ఇన్ఛార్జీ బాధ్యతలను అప్పగించింది. తాజాగా మున్సిపాలిటీల వారీగా కో–ఆర్డినేటర్లను నియమించింది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రచారంలో దూసుకు పోతున్నారు. తమ పరిధిలోని మున్సిపటిల్లో నిత్యం పర్యటిస్తున్నారు. మంత్రులు రోడ్ షోలతో పాటు, కాలనీల్లో సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. మెజారిటీ మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్పై విమర్శలు చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, ఉచిత బస్సు ప్రయాణం, ఫ్రీ గ్యాస్ వంటి పథకాలు తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.