అక్షరటుడే, ఇందూరు: Election Arrangements | మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయాన్ని(Municipal Corporation) సందర్శించి డిస్ట్రిబ్యూషన్ పోలింగ్ ఏర్పాట్ల గురించి కమిషనర్ దిలీప్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.
Election Arrangements | అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు..
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో బ్యాలెట్ పేపర్లు పోస్టల్ బ్యాలెట్ (Postal ballot) ముద్రణ గురించి ఆరా తీశారు. గోప్యతను పాటిస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ముద్రణ జరిపించాలని, పోలీసు భద్రత మధ్య స్ట్రాంగ్ రూములకు తరలించి జాగ్రత్తగా భద్రపరచాలని ఆదేశించారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తయిన తర్వాత వివరాలు ఎక్కడ కూడా బయటకు వెల్లడికాకుండా చూడాలన్నారు.
Election Arrangements | ప్రింటింగ్ ప్రెస్ యజమానులకు..
ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు ముద్రణానంతరం సాఫ్ట్ కాపీలను పూర్తిస్థాయిలో హార్డ్‌డిస్క్ నుంచి తొలగించేలా పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఎన్నికల సంఘం క్రిమినల్ చర్యలు చేపడుతుందని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ జరిపిస్తున్నట్లు వెల్లడించారు. పోలింగ్ ముగిసిన వెంటనే గట్టి బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్స్‌ను కౌంటింగ్ సెంటర్‌కు తరలించేలా తగిన ఏర్పాటు చేయాలని సూచించారు. సమీక్షలో డీఆర్డీవో సాయా గౌడ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.