అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) సోమవారం మంత్రులతో భేటీ కానున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై (MPTC and ZPTC elections) చర్చించనున్నారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు (panchayat elections) ముగిశాయి. మూడు దశల్లో జరిగిన పోలింగ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. దీంతో ఆ పార్టీ జోష్ నెలకొంది. ఇదే ఊపులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సైతం నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో మంత్రులతో సీఎం సమీక్షలో దీనిపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సీఎం సమీక్షించనున్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల (assembly sessions) నిర్వహణ తేదీలు, అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
CM Revanth Reddy | బీసీ రిజర్వేషన్లపై..
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల (BC reservations) అంశంపై సైతం మంత్రులతో చర్చించనున్నట్లు తెలిసింది. పంచాయతీ ఎన్నికల సమయంలో సీఎం మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల అంశం తేలాకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అయితే బీసీ రిజర్వేషన్లు ఇప్పట్లో తేలే అవకాశం లేదు. దీంతో పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఎన్నికలపై అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మంత్రివర్గంలో ఈ అంశంపై చర్చించి, అనంతరం ఎన్నికలపై ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
CM Revanth Reddy | సొపైటీ పాలకవర్గాలు
రాష్ట్ర ప్రభుత్వం సొసైటీల పాలకవర్గాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. వాటి ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల అనంతరం నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని ఇటీవల పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ప్రకటించారు. కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు భర్తీ చేస్తామన్నారు. వీటిపై సైతం మంత్రులతో సీఎం చర్చించనున్నట్లు తెలిసింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరు, బదిలీలపై చర్చించే అవకాశం ఉంది.