అక్షరటుడే, బాన్సువాడ: Bonalu Festival | పట్టణంలోని మాత శిశు ఆస్పత్రిలో (Maternal and Child Hospital) మంగళవారం ఆషాఢ మాసం (Ashada Masam) బోనాల పండగను సంబురంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి (Mla Pocharam Srinivas reddy) హాజరయ్యారు. బోనం ఎత్తుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ (Kasula Balaraj, Chairman, Agros Industries) సైతం బోనం ఎత్తుకుని సంబురాల్లో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ.. ప్రజలు ఆయురారగ్యాలతో పచ్చని పంటలతో కళకళలాడాలని మొక్కుకున్నానన్నారు. సంబురాల్లో ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, సిబ్బంది, పీఎస్ఆర్ టాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు అంజిరెడ్డి, ఎజాజ్, నర్సన్న తదితరులు పాల్గొన్నారు.