121
అక్షరటుడే, ఎల్లారెడ్డి: EX MLA Surender | రాబోయే ఎన్నికల్లో ఎల్లారెడ్డి మున్సిపాలిటీపై (Yellareddy Municipality) బీఆర్ఎస్ జెండా ఎగరేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ (Nallamadugu Surender) సూచించారు. ఈ మేరకు బుధవారం మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలతో పట్టణంలో సమావేశమయ్యారు.
EX MLA Surender | రిజర్వేషన్ల అనంతరం అభ్యర్థుల ఖరారు..
రిజర్వేషన్ల అనంతరం అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్టీ నిర్దేశించిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో సీనియర్ నాయకులు తానాజీ తదితరులు పాల్గొన్నారు.