అక్షరటుడే, వెబ్‌డెస్క్: BJP President | ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇటీవల మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే నిజామాబాద్ పేరును ఇందూరుగా (Nizamabad to Indur) మారుస్తామన్నారు. దీనిపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు (President Ramchander Rao) స్పందించారు.
ఎంపీ అర్వింద్ (MP Dharmapuri Arvind) మాటలకు బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు తెలిపారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే నిజామాబాద్ నగరం పేరును ఇందూరుగా మారుస్తామన్నారు. నిజామాబాద్ మాత్రమే కాదు, మరెన్నో ప్రాంతాల్లోనూ పేర్లు మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పేర్లు నిజాం పాలనలో జరిగిన దౌర్జన్యాలను మళ్లీ మళ్లీ మనకు గుర్తు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
నిజాంపాలనలో తెలంగాణలోని పలు ప్రాంతాల పేర్లను మార్చారు. భాగ్యనగరాన్ని హైదరాబాద్‌గా, ఇందూరును నిజామాబాద్‌గా, ఎలగందులను కరీంనగర్‌గా, ఎదులాపురంను ఆదిలాబాద్‌గా మార్చారు. ఇలా అనేక ప్రాంతాల పేర్లను నిజాంల హయాంలో మార్చారు. బీజేపీ నాయకులతో ఎంతో కాలంగా వీటి పేర్లు మార్చాలని డిమాండ్చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ.. పేర్ల మార్పుకు పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.