అక్షరటుడే, గాంధారి : Gandhari Accident | ఫంక్షన్‌కి వెళ్లి వస్తూ బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గాంధారి మండలం (Gandhari Mandal)లోని బ్రాహ్మణపల్లి (Brahmanapalli) వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
గ్రామస్తులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన బొమ్మని శేఖర్ (45) తాడ్వాయిలో శుభకార్యానికి వెళ్లాడు. అనంతరం మోతె మీదుగా తన స్వగ్రామమైన బ్రాహ్మణపల్లికి తిరిగి బయలు దేరాడు. గుడ్జాల గ్రామ శివారులో మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శేఖర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు (SI Anjaneyulu) తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.