ePaper
More
    Homeటెక్నాలజీHyundai Creta | దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు.. క్రెటాకు అంత క్రేజెందుకంటే..

    Hyundai Creta | దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు.. క్రెటాకు అంత క్రేజెందుకంటే..

    Published on

    అక్షరటుడే వెబ్ డెస్క్: Hyundai Creta | కారు(Car) ఒకప్పుడు స్టేటస్‌ సింబల్‌(Status symbol).. ఆర్థికంగా బలంగా ఉన్నవారికే కార్లను కొనుగోలు చేసే స్థోమత ఉండేది. మార్కెట్‌లో వాటా market share పెంచుకోవడంకోసం మధ్యతరగతి(Middle class) కుటుంబాలను ఆకర్షించడానికి కంపెనీలు companys ఎంతగా ప్రయత్నించినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. కానీ కోవిడ్‌(Covid) మహమ్మారి ఈ పరిస్థితిని మార్చేసింది. కారు స్టేటస్‌ సింబల్‌నుంచి అవసరంగా మారిపోయింది. దీంతో కార్ల కంపెనీల cars companys పంట పండుతోంది. ఇందులోనూ స్పేసియస్‌గా ఉండే ఎస్‌యూవీ(SUV) కార్లను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

    Hyundai Creta | హ్యుందాయ్‌ క్రెటా జోరు..

    దేశీయ ఆటోమొబైల్‌ పరిశ్రమలో automobile industry హ్యుందాయ్‌(Hyundai) ఎస్‌యూవీ మోడల్‌ క్రెటా సంచలనం సృష్టిస్తోంది. దీని ఆధునిక డిజైన్‌, అధునాతన ఫీచర్లు, భద్రత అంశాలు safety features ప్రజలలో క్రేజ్‌ పెంచుతున్నాయి. అందుకే వరుసగా రెండో నెలలోనూ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా ఈ మోడల్‌ నిలిచింది. గతనెల(Last month)లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీ  కారుగా క్రెటా రికార్డు Creta record నెలకొల్పిందని హ్యుందాయ్‌ కంపెనీ Hyundai company ప్రకటించింది. అంతకుముందు నెలలోనూ(మార్చి) క్రెటానే అగ్రస్థానంలో ఉందని పేర్కొంది. ఏప్రిల్‌లో 17,016 యూనిట్లను విక్రయించగా.. మార్చి(March)లో 18,059 యూనిట్లు అమ్మినట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో financial year క్రెటా కార్లు creta cars 1,94,871 అమ్ముడయ్యాయి. తద్వారా దేశంలో అత్యధికంగా అమ్ముడైన మూడో కారుగా నిలిచింది.

    Hyundai Creta | ప్రజాదరణ పొందడానికి కారణాలు..

    1. క్రెటా ఆకర్షణీయమైన డిజైన్‌(Design)ను కలిగి ఉంటుంది. పెద్ద కాస్కెడింగ్‌ గ్రిల్‌, స్టైలిస్‌ ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్‌లను కలిగి ఉంది.
    2. ఇందులో పెద్ద టచ్‌ స్క్రీన్‌ touchscreen ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, వైర్‌లెస్‌ చార్జింగ్‌, పనోరమిక్‌ సన్‌రూఫ్‌, లెవల్‌ 2
    3. అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్స్‌(ADAS) వంటి అధునాతన ఫీచర్లున్నాయి.
    4. మూడు ఇంజన్‌ ఆప్షన్లను కలిగి ఉంది. 1.5 లీటర్‌ పెట్రోల్‌, 1.5 లీటర్‌ డీజిల్‌, 1.4 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌. ఇది మాన్యువల్ (Manual), ఆటోమెటిక్‌, ఇంటెలిజెంట్‌ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ గేర్‌ బాక్స్‌లతో అందుబాటులో ఉంది.
    5. పది వేరియంట్లలో క్రెటా అందుబాటులో ఉంది. రూ. 11 లక్షలనుంచి రూ. 23.50 లక్షల (ఎక్స్‌ షోరూం) ధరల రేంజ్‌లో లభిస్తోంది.
    6. 6 ఎయిర్‌ బ్యాగ్‌ల(Air bags)తోపాటు 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, ఏడీఏఎస్‌ ఫీచర్లతో భద్రతకు భరోసా ఇస్తుంది.

    More like this

    Local Body Elections | స్థానిక ఎన్నికలపై కీలక అప్​డేట్​.. రిజర్వేషన్ల పెంపునకు గవర్నర్​ ఆమోదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్​డేట్​ వచ్చింది. బీసీ...

    Sriram Sagar | శ్రీరాంసాగర్ వరద గేట్ల మూసివేత

    అక్షరటుడే, బాల్కొండ: Sriram Sagar | తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి (Sriram Sagar Project) వరద తగ్గుముఖం...

    Yellareddy | చెరువు బాగు కోసం రైతులంతా ఏకమయ్యారు..

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామస్థులు తమ చెరువును...