Homeజిల్లాలుకామారెడ్డిBC Declaration | బీసీ డిక్లరేషన్​ సభను విజయవంతం చేయాలి

BC Declaration | బీసీ డిక్లరేషన్​ సభను విజయవంతం చేయాలి

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: BC Declaration | కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 15న జరగనున్న బీసీ డిక్లరేషన్ సభను బీసీలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజయవంతం చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (Mla madan Mohan Rao) అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ డిక్లరేషన్ సన్నాహక సమావేశంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు.

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్కతో కలిసి సభ ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు మాట్లాడుతూ.. ఈనెల 15న బీసీ డిక్లరేషన్ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు.

బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర మోకాలడ్డుతోందని విమర్శించారు. 15న జరిగే బీసీ సభ ద్వారా బీసీల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధిని నిరూపించుకుంటామని, ప్రతిపక్షాల తీరును ఎండగడతామని అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Must Read
Related News