అక్షరటుడే, ఇందూరు: Alumni Reunion | డిచ్పల్లి (Dichpally) మండలంలోని మెంట్రాజ్పల్లి (Mentrajpalli) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2003-04 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆటపాటలతో ఆనందంగా గడిపారు. అనంతరం తమకు విద్యాబుద్ధులను నేర్పిన ఉపాధ్యాయులు విష్ణువర్ధన్, మహేష్, రవీందర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సతీష్, వినోద్, ప్రవీణ్ చారి, పవన్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
Alumni Reunion | ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
మెంట్రాజ్పల్లిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2003–04 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు ఆదివారం పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ మేరకు తమ మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
83