అక్షరటుడే, ఆర్మూర్ : Armoor Police | పట్టణంలో పలు కాలనీల్లో చోరీలు చేసి పరారీలో ఉన్న నిందితుడు దాసరి అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ (SHO Satyanarayana Goud) గురువారం పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు.
Armoor Police | తాను చోరీ చేసిన బైక్‌పై..
పట్టణంలోని పంత్ రోడ్డు, రామ్ నగర్ (Ram Nagar), హౌసింగ్ బోర్డ్ కాలనీలో చోరీలు చేసిన నిందితుడు దాసరి అనిల్ గురువారం ఉదయం తాను చోరీ చేసిన బైక్‌పై వెళ్తుండగా ఆర్మూర్ బస్టాండ్ (Armoor Bus Stand) వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అనంతరం అతడి వద్ద నుంచి హెచ్ఎఫ్ డీలక్స్ బైక్, బంగారు గొలుసు, ఉంగరం, 10 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. చోరీ కేసులో దాసరి అనిల్ కదలికలను గమనించి కేసును ఛేదించిన కానిస్టేబుల్ కిరణ్‌కుమార్, హరీష్‌లను ఎస్‌హెచ్‌వో అభినందించారు.