అక్షరటుడే, వెబ్డెస్క్: TET Result | ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) టెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. గతేడాది డిసెంబర్ 10 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. అధికారులు శుక్రవారం ఫలితాలు విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్లో గతేడాది జరిగిన టెట్ పరీక్షలకు (TET exams) మొత్తం 2,71,692 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2,48,427 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో 97,560 మంది (39.27 శాతం) పాస్ అయ్యారు. టెట్ పరీక్షకు ప్రస్తుతం పని చేస్తున్న ఉపాధ్యాయులు సైతం హాజరయ్యారు. ఇన్ సర్వీస్ టీచర్లు 31,886 మంది పరీక్ష రాయగా.. 15,239 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను టెట్ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి విడుదల చేశారు. అభ్యర్థులను https://tet2dsc.apcfss.in, http://cse.ap.gov.in వెబ్సైట్లో తమ ఫలితాలు చూసుకోవచ్చు. వాట్సాప్ నంబర్ 9552300009ద్వారా కూడా రిజల్ట్ తెలుసుకోవచ్చు.