HomeతెలంగాణTemporary transfers allowed | జీఓ 317, జీఓ 46పై అభ్యంతరాలకు పరిష్కారం.. తాత్కాలిక బదిలీలకు...

Temporary transfers allowed | జీఓ 317, జీఓ 46పై అభ్యంతరాలకు పరిష్కారం.. తాత్కాలిక బదిలీలకు అనుమతి!

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Temporary transfers allowed | తెలంగాణ Telangana ప్రభుత్వ ఉద్యోగుల government employees కు సంబంధించి కీలక అప్​డేట్​ చోటుచేసుకుంది.

జీఓ 317, జీఓ 46పై అభ్యంతరాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం దిశగా అడుగులు వేసింది. జీఓ 317 (GO 317), జీఓ 46పై అభ్యంతరాల పరిష్కారానికి GO 190 ను సర్కారు విడుదల చేసింది.

Temporary transfers allowed | కొన్ని పరిమితులు..

ఇంటర్ లోకల్ కేడర్ inter-local cadre తాత్కాలిక బదిలీ transfers లకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. రెండు, మూడేళ్ల కోసం డిప్యుటేషన్​కు అవకాశం ఇచ్చింది.

కాగా, ఖాళీలను బట్టి తాత్కాలిక బదిలీలకు అవకాశం కల్పించింది. ఇక డిసిప్లినరీ కేసులు ఉన్నవారికి అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్​ ఇచ్చింది. డిప్యుటేషన్ ఉద్యోగులకు TA/DA లేదని సర్కారు స్పష్టం చేసింది.

ఒకసారి సౌకర్యం పొందిన వారికి మళ్లీ అవకాశం లేదని కూడా సర్కారు పేర్కొంది. మరో విషయం ఏమిటంటే.. జీఓ 317 తర్వాత ప్రమోషన్ పొందిన వారికి అవకాశం లేదని స్పష్టం చేసింది.

Must Read
Related News