ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMla Laxmi Kantha Rao | రేవంత్​రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ

    Mla Laxmi Kantha Rao | రేవంత్​రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ

    Published on

    అక్షరటుడే, బిచ్కుంద: Mla Laxmi Kantha Rao | సీఎం నాయకత్వలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని జుక్కల్​ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. జుక్కల్​ నియోజకర్గంలో (Jukkal Constituency) రూ. 6.82 కోట్లతో పలు అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తాను గెలవగానే ముందుగా గ్రామాల్లో రోడ్లను బాగుచేస్తానని హామీ ఇచ్చానని.. ప్రస్తుతం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నానన్నారు. నియోజకవర్గంలో సీ.సీ రోడ్ల నిర్మాణం కోసం ఇప్పటి వరకు మొత్తం రూ.33 కోట్ల నిధులు మంజూరు చేయించానన్నారు.

    Mla Laxmi Kantha Rao | ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు..

    అదేవిధంగా ప్రతీ గ్రామానికి బీటీ రోడ్లు వేయించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. గత పాలకులు చేయలేని అసాధ్యమైన పనులు కూడా చేపడుతున్నామని అన్నారు. అసమర్థ నాయకుల వల్ల ఆగిపోయిన లెండి, నత్తనడకన సాగుతున్న నాగమడుగు ప్రాజెక్టుల (Nagamadugu Project) పనులు నేడు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu)నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, ఇక ముందు కూడా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.

    Mla Laxmi Kantha Rao | రైతు బాంధవుడు సీఎం రేవంత్​రెడ్డి..

    రైతు బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth reddy) గారు ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లో రూ. 9 వేల కోట్ల రైతు భరోసా (Rythu Barosa) నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా సన్నాలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి అన్నదాతకు అండగా నిలిచాడన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే రేషన్ దుకాణాల్లో ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నామని, పేదలందరూ మూడు పూటలా కడుపు నిండా అన్నం తింటున్నారని సంతోషం వ్యక్తం చేశారు.కాబట్టి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ప్రజా ప్రభుత్వానికి అండగా నిలబడి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కోరారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...