Telangana Earthquake Tremors | తెలంగాణలో భూకంపం

తెలంగాణలో స్వల్పంగా భూమి కంపించింది. మంచిర్యాల జిల్లాలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Earthquake Tremors | తెలంగాణలో స్వల్పంగా భూమి కంపించింది. మంచిర్యాల జిల్లా (Mancherial District)లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

తెలంగాణ, మహారాష్ట్ర (Maharashtra) సరిహద్దు ప్రాంతాల్లో భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్‌పై 3.9గా తీవ్రత నమోదు అయింది. మంచిర్యాల కు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి నష్టం జరగలేదు. అయితే అర్ధరాత్రి ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.గోదావరి పరీవాహక ప్రాంతంలో భూకంపాలు వస్తుంటాయని అధికారులు పేర్కొన్నారు. ఐదేళ్లలో ఈ ప్రాంతంలో ఇలాంటి స్వల్ప భూకంపాలు ఐదు వచ్చినట్లు తెలిపారు. కాగా గతేడాది 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. కాగా ఇటీవల ఏపీలో సైతం భూ ప్రకంపలను చోటు చేసుకున్నాయి.

Related articles

Exam Center Security | పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

ఇంటర్​ పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు. బోధన్​ పట్టణంలోని జూనియర్​ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు.

NCERT Book Ban | ఎన్​సీఈఆర్​టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. పుస్తకంపై నిషేధం

ఎన్​సీఈఆర్​టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎనిమిదో తరగతి సోషల్​ సైన్స్​ పుస్తకాన్ని నిషేధించింది.

Chain Snatching Kotagiri | కోటగిరిలో చైన్​స్నాచింగ్​.. మూడు తులాల గొలుసు అపహరణ..

జిల్లాలో వరుస చైన్​స్నాచింగ్​ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో అనే తేడాలేకుండా ఎక్కడ పడితే అక్కడ దోపిడీకి తెగబడుతున్నారు.

Holi Special Trains | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. హోలీకి ప్రత్యేక రైళ్లు

హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 1,244 ట్రిప్పులు వేసినట్లు పేర్కొంది.