అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Budget Sessions 2026 | తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) 28న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్నున్నారు.
తెలంగాణ బడ్జెట్ (Telangana Budget)పై ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 26 నుంచి సమావేశాలు నిర్వహించనుంది. 10 నుంచి 15 రోజుల పాటు సభ నిర్వహించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక ప్రవేశ పెడుతున్న మూడో బడ్జెట్ కావడంతో దీనిపై ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు. అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూనే, సంక్షేమానికి పెద్ద పీఠవేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఆరు గ్యారంటీల అమలుకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
Telangana Budget Sessions 2026 | ప్రజల ఆశలు
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. రైతు భరోసా (Rythu Bharosa) ఏడాదికి రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు, కౌలు రైతులకు రైతు భరోసా అందిస్తామని ప్రకటించింది. అలాగే పెన్షన్ల పెంపు, మహిళలకు ప్రతినెల రూ.2500 ఇస్తామని పేర్కొంది. ఆయా హామీలు ఇప్పటికి అమలు కావడం లేదు. ఈ బడ్జెట్లో ఆయా పథకాల కోసం నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా పింఛన్లు పెంచాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా ఇప్పటి వరకు జమ చేయలేదు. దీంతో రైతు భరోసా వెంటనే విడుదల చేయడంతో పాటు వచ్చే వానాకాల సీజన్ నుంచి ఎకరాకు రూ.15 వేలు ఇచ్చేలా బడ్జెట్ కేటాయించాలని రైతులు కోరుతున్నారు.
Telangana Budget Sessions 2026 | ఇందిరమ్మ ఇళ్లకు..
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సాగుతోంది. నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇల్లు కట్టుకుంటున్న వారికి బిల్లులు ఇస్తోంది. అయితే ఇంకా చాలా మంది ఇందిరమ్మ ఇళ్ల (Indiramma House) కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే పట్టణాల్లో సైతం ఇళ్లు నిర్మిస్తామని ఇటీవల మంత్రులు ప్రకటించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఏప్రిల్‌లో మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. దీంతో ఈ పథకానికి భారీగా కేటాయింపులు అవసరం అవుతాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.