37
అక్షరటుడే, కామారెడ్డి: Teenmar Mallanna | తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) శుక్రవారం కామారెడ్డికి రానున్నారు. కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో (Kamareddy municipal elections) టీఆర్పీ తరపున పోటీ చేస్తున్న ఏడుగురు కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు తాహెర్ మహమ్మద్ తెలిపారు.
కామారెడ్డి పట్టణంలో..
కామారెడ్డి పట్టణానికి ఉదయం 11 గంటలకు చేరుకున్న అనంతరం 9, 13, 17, 1, 19, 18 వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థుల తరపున మల్లన్న ప్రచారంలో పాల్గొంటారని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మల్లన్న అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు.