అక్షరటుడే, కామారెడ్డి : MLC Mallanna Visit | తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) శుక్రవారం కామారెడ్డికి రానున్నారు. కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో (Kamareddy municipal elections) టీఆర్పీ తరఫున ఏడుగురు కౌన్సిలర్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించడానికి మల్లన్న కామారెడ్డి వస్తున్నట్టుగా జిల్లా అధ్యక్షుడు తాహెర్ మహమ్మద్ తెలిపారు. ఉదయం 11 గంటలకు కామారెడ్డి పట్టణానికి చేరుకున్న తర్వాత 9, 13, 17, 1, 19, 18 వార్డులలో కౌన్సిలర్ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొననున్నారని తెలిపారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు, మల్లన్న అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు. బీసీలకు రాజ్యాధికారంతో పార్టీ ఏర్పాటు చేసిన తీన్మార్ మల్లన్న మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ క్రమంలో పలు వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు బరిలో దిగగా వారి తరఫున ప్రచారం చేస్తున్నారు.