అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bangladesh | బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని జియా కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి చేరుకున్నారు.
లండన్‌లో 17 సంవత్సరాల ప్రవాసం తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (Bangladesh Nationalist Party) తాత్కాలిక అధ్యక్షుడు తారిఖ్ రెహమాన్ గురువారం తన భార్య మరియు కుమార్తెతో ఢాకా చేరుకున్నారు.యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హది హత్య తర్వాత దేశం హింసతో సతమతమవుతున్న తరుణంలో ఆయన రావడం గమనార్హం. హది మరణం బంగ్లాదేశ్ అంతటా ఉద్రిక్తతలను పెంచింది. తారిఖ్ రెహమాన్ మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియా (Former PM Khaleda Zia) కుమారుడు. పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. లక్షలాది మంది మద్దతుదారులు ఢాకా విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు.
Bangladesh | భారీ భద్రత
తారీక్ రాక నేపథ్యంలో ఆ దేశంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. తాత్కాలిక ప్రభుత్వం బిఎన్‌పి డిమాండ్లకు పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చింది. విమానాశ్రయం నుంచి తారిక్ రెహమాన్ (Tariq Rahman) నేరుగా పూర్వాంచల్‌లోని 300 అడుగుల రోడ్డులో జరిగే స్వాగత కార్యక్రమానికి వెళ్తారు. అక్కడ ప్రసంగిస్తారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న తన తల్లి ఖలీదా జియాను ఆసుపత్రిలో సందర్శిస్తారు.
తారిక్ రెహమాన్ తిరిగి రావడాన్ని బీఎన్పీ ఒక ప్రధాన రాజకీయ అవకాశంగా భావిస్తోంది. ఫిబ్రవరిలో జరిగే పార్లమెంటరీ ఎన్నికలకు (Parliamentary Elections) ముందు ఆయన ఉనికి పార్టీని బలోపేతం చేస్తుంది. అయితే, దేశంలో కొనసాగుతున్న అశాంతి, హింస ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.