Bheemgal
Bheemgal | పింఛన్లు పెంచాలని తహశీల్దార్ కార్యాలయం ముట్టడి

అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | కాంగ్రెస్​ ప్రభుత్వం పింఛన్లు (pensions) పెంచి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్​, వీహెచ్​పీఎస్​, సీహెచ్​పీఎస్​ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండల కేంద్రంలోని భీమ్​గల్​ తహశీల్దార్​ కార్యాలయాన్ని (Bheemgal Tahsildar office) గురువారం ముట్టడించారు.

ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మరిచిపోయి పింఛన్​దారులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పింఛన్లు పెంచి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఏడాదిన్నర గడిచినా ఊసెత్తకపోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.

మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో మూడు నెలలుగా పింఛన్ల పెంపు కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నామని.. కానీ సీఎం ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం భీమ్​గల్​ తహశీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. ఈనెల 20న జీపీల ముట్టడి నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్​ భీమ్​గల్, ధర్పల్లి ఇన్​ఛార్జీలు దీపక్, రాజేందర్, సుధీర్, వీహెచ్​పీఎస్​ నాయకులు మోహన్, బాపూరావు, భూమన్న, మహిళలు తదితరులు పాల్గొన్నారు.