అక్షరటుడే, వెబ్డెస్క్: Maharashtra Deputy CM | మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ (Sunetra Pawar) ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్.. సునేత్రతో ప్రమాణ స్వీకారం చేయించారు. సాయంత్రం 5 గంటలకు లోక్ భవన్లో (Lok Bhavan) ఈ కార్యక్రమం నిర్వహించారు. సునేత్ర ప్రమాణ స్వీకారంతో మహారాష్ట్ర చరిత్రలో తొలి మహిళా డిప్యూటీ సీఎంగా నిలిచారు.
ఈ నెల 28న జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన భార్య, ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్న సునేత్రకు ఆ పదవిని కట్టబెట్టారు. ఆమె 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం రాజ్యసభ సభ్యురాలిగా (Rajya Sabha member) ఎంపికయ్యారు. శనివారం మధ్యాహ్నం ఎన్సీపీకి చెందిన 40 మంది శాసనసభ్యులు సమావేశం అయ్యారు. తమ శాసనసభ పక్ష నేతగా సునేత్రను ఎన్నుకున్నారు.
Maharashtra Deputy CM | శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు స్పందించిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎంగా సునేత్ర ప్రమాణస్వీకారంపై తనకు సమాచారం లేదని పేర్కొన్నారు. ఆ విషయం ఆమె తనకు చెప్పలేదన్నారు. విలీనం సమయంలో ఇది ఊహించని పరిణామమని వ్యాఖ్యానించారు. కాగా.. అజిత్ పవార్ తన బాబాయి శరద్ పవార్ ఏర్పాటు చేసిన ఎన్సీపీని చీల్చిన విషయం తెలిసిందే. అయితే శరద్ పవార్ మాట్లాడుతూ.. రెండు పార్టీల విలీనానికి జనవరి 17న చర్చలు జరిగాయన్నారు. ఫిబ్రవరి 12న విలీనానికి ముహూర్తం పెట్టుకున్నట్లు తెలిపారు.
VIDEO | Mumbai: Sunetra Pawar (@SunetraA_Pawar) takes oath as Maharashtra Deputy CM, at Lok Bhavan.#Maharashtra
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/Epyjl5ubT5
— Press Trust of India (@PTI_News) January 31, 2026