Homeజిల్లాలునిజామాబాద్​Mendora | అకస్మాత్తుగా కురిసిన వర్షం.. రైతన్న ఆగమాగం..

Mendora | అకస్మాత్తుగా కురిసిన వర్షం.. రైతన్న ఆగమాగం..

మెండోరా మండలంలో ఒక్కసారిగా వచ్చిన వర్షం రైతులను ఆగమాగం చేసింది. ఈ సందర్భంగా ధాన్యం, మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

- Advertisement -

అక్షరటుడే, మెండోరా : Mendora | జిల్లాలో ఆకస్మాత్తుగా కురిసిన వర్షం రైతులను ఆగమాగం చేసింది. అప్పటివరకు ఎండకాసిన ఆకాశంలో మబ్బులు ఒక్కసారిగా కమ్మేసి వర్షం (Rain) కురియడంతో రైతులు ఆందోళన చెందారు.

Mendora | మెండోరా మండలంలో..

మెండోరా (Mendora) మండలంలో కోతకోసిన వరిని, మొక్కజొన్నను రైతులు ఆరబోశారు. వర్షం కురిసే ఆనవాళ్లు ఏమాత్రం లేకపోవడంతో వారు ఆరుబయట ధాన్యం ఆరబోశారు. కొనుగోలు కేంద్రాల్లో సైతం ధాన్యం బయటే ఉంది. కాని మంగళవారం మధ్యం ఒక్కసారిగా వచ్చిన వర్షంతో రైతులంతా (Farmers) ఆందోళన చెందారు. రోడ్లపై, కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న పంట పూర్తిగా తడిసిపోయింది. అలాగే కోతకు వచ్చిన ధాన్యం కూడా వర్షానికి తడిసిపోయింది.

Mendora | మొక్కజొన్న రైతుల ధైన్యం..

ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడ్డారు. వర్షం భారీగా పడడంతో ఆరు బయట మొక్కజొన్న పంట పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులు మెండోరా తహశీల్దార్​ (Mendora Tahsildar)కు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికైనా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. తడిసిపోయిన ధాన్యానికి లెక్కగట్టి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.