- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిStudy Tour | స్టడీ టూరా..? వెకేషన్ టూరా..? గుస్సా అవుతున్న రైతులు..

Study Tour | స్టడీ టూరా..? వెకేషన్ టూరా..? గుస్సా అవుతున్న రైతులు..

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Study Tour | ఇతర ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి గురించి తెలుసుకునేందుకు అప్పుడప్పుడు పాలకవర్గాలు స్టడీ టూర్​ పేరుతో సందర్శిస్తూ ఉంటాయి.. అలాగే అభివృద్ధి చెందిన మార్కెట్ యార్డు మాదిరిగా ఇక్కడున్న మార్కెట్ యార్డు మార్చడానికి మార్కెట్​ కమిటీ సభ్యులు (Market Committee Members) విధివిధానాలను తెలుసుకుంటూ ఉంటారు. ఇదేవిధంగా మంగళవారం కూడా కామారెడ్డి మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు విజయవాడ మార్కెట్ కమిటీ సందర్శనకు వెళ్లారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా ఇక్కడే అసలు విషయం ఇక్కడే ఉంది.

Study Tour | ఛైర్మన్​ లేకుండా వెళ్లడమేంటి..?

పాలకవర్గం ఏ సందర్శనకు వెళ్లినా సంబంధిత పాలకవర్గ సభ్యులు మాత్రమే గ్రూప్​గా వెళ్లాల్సి ఉంటుంది. ఇతరులకు అవకాశం ఉండదు. ఒకవేళ వెళ్లాలనుకుంటే ఖర్చులు స్వయంగా ఆయనే భరించుకోవాల్సి ఉంటుంది. సభ్యుల టూర్​కు సంబంధించిన ఖర్చు మాత్రం మార్కెట్ కమిటీ చెల్లిస్తుంది.

- Advertisement -

Study Tour | ఛైర్మన్​, వైస్​ఛైర్మన్​ ఇద్దరూ వెళ్లలేదా..?

కామారెడ్డి మార్కెట్ కమిటీ (Kamareddy Market Committee) ఛైర్మన్​గా ప్రభుత్వం మహిళను నియమించింది. అయితే విజయవాడ మార్కెట్ కమిటీ సందర్శనకు ఛైర్మన్ లేకుండానే వెళ్లారు. అయితే ఛైర్మన్ స్థానంలో ఆమె భర్త స్టడీ టూర్​కు (Study Tour) వెళ్లడం గమనార్హం. అధికారంలో ఉంటే మనకు అడ్డు చెప్పేది ఎవరు అనుకున్నారో తెలియదు కాని ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లేకుండా ఛైర్మన్ భర్తతో కలిసి సభ్యులు సందర్శనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వెళ్లిన సభ్యులు మార్కెట్ కమిటీ సందర్శించి తిరిగి రావాల్సి ఉంటుంది. అలా అక్కడున్న ప్రదేశాలను చుట్టుముట్టి తీర్థయాత్రలు చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. దీనిపై మార్కెట్ కమిటీ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News