అక్షరటుడే, బాన్సువాడ: Inter Exams | విద్యార్థులు లక్ష్యసాధనకు కష్టపడి చదివి ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలు సాధించాలని బాన్సువాడ ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ( SRNK Government Degree College) కళాశాల ప్రిన్సిపాల్ ఇందూరు గంగాధర్ సూచించారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి డిగ్రీ అడ్మిషన్లపై శనివారం అవగాహన కల్పించారు.
Inter Exams | విద్యార్థులతో ముఖాముఖి..
ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ (Intermediate students) రెండో సంవత్సరం విద్యార్థులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఇంటర్ అనంతరం డిగ్రీలో వివిధ కోర్సుల గురించి విద్యార్థులకు వివరించారు. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అందుబాటులో ఉన్న ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, లైబ్రరీ, నాణ్యమైన బోధన సదుపాయాలు తదితర అంశాలను వివరించారు.
జూన్లో దోస్త్ నోటిఫికేషన్..
జూన్ నెలలో విడుదలయ్యే దోస్త్ నోటిఫికేషన్ ద్వారా డిగ్రీ అడ్మిషన్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని ప్రిన్సిపాల్ తెలిపారు. అనంతరం ఆయన లక్ష్యసాధన కోసం క్రమశిక్షణతో చదవాలన్నారు. సోషల్మీడియా సరైన రీతిలో వినియోగించుకోవాలని సూచించారు. యువత దుర్వ్యసనాలకు అలవాడు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల అధ్యాపకులు వినయ్ కుమార్, చిరంజీవి, భగవాన్ రెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.