Homeజిల్లాలునిజామాబాద్​MLA Pocharam | ఆలస్యంగా కళాశాలలకు వెళ్తున్న విద్యార్థినులు.. ప్రత్యేక బస్సు వేయించిన ఎమ్మెల్యే పోచారం..

MLA Pocharam | ఆలస్యంగా కళాశాలలకు వెళ్తున్న విద్యార్థినులు.. ప్రత్యేక బస్సు వేయించిన ఎమ్మెల్యే పోచారం..

బస్సుల కోసం గంటల తరబడి రోడ్లపై వేచి ఉంటున్న విద్యార్థుల కోసం ఎమ్మెల్యే పోచారం పరిష్కారం మార్గం చూపారు.. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు వేయించారు.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: MLA Pocharam | నిత్యం బస్సుల్లో రద్దీ కారణంగా పాఠశాలలకు ఆలస్యంగా వెళ్తున్న విద్యార్థినులను చూసిన పోచారం తక్షణ పరిష్కారం చూపారు. వెంటనే వారికోసం ప్రత్యేక బస్సు (special bus) సౌకర్యం కల్పించారు.

వివరాల్లోకి వెళ్తే.. బాన్సువాడ పట్టణం నుంచి తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) వెళ్తున్నారు. అయితే దుర్కి శివారులోని ఎస్​ఆర్​ఎన్​కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల (SRNK Government Degree College) వద్ద రహదారిపై బాన్సువాడకు వెళ్లే బస్సు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థినులను గమనించిన పోచారం తక్షణమే వాహనాన్ని ఆపారు. బస్సులు సమయానికి రాకపోవడం.. వచ్చినప్పటికీ పూర్తిగా ప్రయాణికులతో నిండిపోయి వస్తుండడంతో తాము సమయానికి పాఠశాలలకు వెళ్లలేకపోతున్నామని విద్యార్థినులు వాపోయారు.

MLA Pocharam | తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే..

దీంతో వారి బాధలు అర్థం చేసుకున్న ఎమ్మెల్యే పోచారం సీరియస్‌గా స్పందించారు. వెంటనే బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ రవి కుమార్​తో ఫోన్‌లో మాట్లాడి ఉదయం కళాశాల నుంచి బాన్సువాడ వరకు, సాయంత్రం బాన్సువాడ (Banswada) నుంచి కళాశాల వరకు విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను నడపాలని ఆదేశించారు. అనంతరం పోచారం మాట్లాడుతూ.. విద్యార్థినులు సమయానికి కాలేజీలకు వెళ్లే విధంగా భద్రత దృష్ట్యా ఈ చర్య తీసుకున్నామని పేర్కొన్నారు. తమ సమస్యపై వెంటనే స్పందించి ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి విద్యార్థినులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.