Homeజిల్లాలుకామారెడ్డిLingampet | రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన విద్యార్థి

Lingampet | రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన విద్యార్థి

లింగంపేట మండలం భవానీపేట ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి అరవింద్ అండర్–14 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. వివరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మదన్మోహన్ రెడ్డి వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, లింగంపేట: Lingampet | మండలం భవానీపేట ఉన్నత పాఠశాలకు (Bhawanipet High School) చెందిన విద్యార్థి అరవింద్ అండర్–14 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు (under-14 state-level kabaddi competitions) ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మదన్మోహన్ రెడ్డి తెలిపారు.

నిజామాబాద్​లో మంగళవారం ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు (joint district-level kabaddi competitions) నిర్వహించారు. అందులో ప్రతిభ కనబర్చిన అరవింద్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీడీ శ్రీ రేఖను, విద్యార్థి అరవింద్​ను గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో మరింత ప్రతిభ కనబర్చి పాఠశాలకు, గ్రామానికి పేరు తేవాలని పేర్కొన్నారు.