అక్షరటుడే, భీమ్గల్: Balkonda SI | ఈవ్ టీజింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని బాల్కొండ ఎస్సై శైలేందర్ (Balkonda SI Shailender) అన్నారు. బాల్కొండ కస్తూర్బా గాంధీ విద్యాలయం ఆదర్శ పాఠశాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ మోసాలు మాదకద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆన్లైన్ మోసాలు (online frauds) పెరిగినందున అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వద్దని సూచించారు. ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ చెప్పాలని అడిగితే చెప్పవద్దని వివరించారు. మైనర్ డ్రైవింగ్, సీసీ కెమెరాల (CCTV cameras) ఏర్పాటు తదితర విషయాలను గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారి భవాని, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, షీ టీం సిబ్బంది విగ్నేష్ సుమతి, మమత, రోహిణి, ఉపాధ్యాయులు గణేశ్, సుకుమార్, విజయలక్ష్మి, శ్రీనివాస్ రాజ్, శ్రావణి తదితర పాల్గొన్నారు.