- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Dog Bite | వీధికుక్కల స్వైరవిహారం.. చిన్నారులపై దాడి..

Dog Bite | వీధికుక్కల స్వైరవిహారం.. చిన్నారులపై దాడి..

- Advertisement -

అక్షరటుడే, బోధన్ : Dog Bite | బోధన్(Bodhan)​ పట్టణంలో వీధికుక్కలు వీరవిహారం చేస్తున్నాయి. చిన్నారులను గాయపరుస్తున్నాయి. కుక్కల వల్ల చిన్నారులు, వృద్ధులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మున్సిపల్​ సిబ్బంది(Municipal Staff)కి ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Dog Bite | బోధన్​ పట్టణంలో..

బోధన్ మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో వీధికుక్కలు(Street Dogs) మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు చిన్నారులను గాయపర్చాయి. వార్డులోని మూడేళ్ల అనిషా అనే బాలికను, రెండేళ్ల షేక్​ ఉమర్​ను విచక్షణారహితంగా కరిచాయి. వెంటనే వారి కుటుంబీకులు బోధన్​ ఆస్పత్రి(Bodhan Hospital)కి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వీధికుక్కల సమస్యకు పరిష్కారం చూపాలని కాలనీవాసులు కోరుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News